Gold Rates: పసిడి ప్రియులకు మరోసారి బంగారం ధరలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఇవాళ మరోసారి భారీగా ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1800 రూపాయలు దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1650 రూపాయలు తగ్గింది. ఇవాళ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం 96వేల 880 పలుకుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర 88వేల 800 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగాయి. గతేడాది నవంబర్‌లో 24 క్యారెట్ల తులం బంగారం 75 వేలు ఉండేది. 22 క్యారెట్ల తులం బంగారం 70 వేల లోపు ఉండేది. కానీ.. ఈ 6 నెలల్లో ప్యూర్ గోల్డ్ తులం 25 వేలు పెరిగింది. ఏప్రిల్ 22న లక్ష రూపాయలు దాటింది. ఆ తర్వాత మళ్లీ తగ్గుతూ, పెరుగుతూ లక్షకు చేరువలోనే ఉంటుంది.
బంగారం అనేది జనరల్‌గా రెండు ఇంటర్నేషనల్ కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా బంగారం తగ్గడానికి కారణం పాకిస్థాన్ ఇండియాకు మధ్య జరుగుతున్న యుద్ధం ఒక ఒప్పందంకు రావడం.. వల్ల బంగారం కాస్తా తగ్గుముఖం పట్టాయి. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత సుంకాలను విపరీతంగా పెంచడం జరిగింది. ప్రతీకార సుంకాలపై అమెరికా- చైనా మధ్య చర్చలు మొదలయ్యాయి. దీంతో వాణిజ్య యుద్ధ భయాలు తగ్గాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే పసిడి ధర ఔన్సుకు 50 డాలర్ల మేర తగ్గింది. దీంతో దేశీయంగానూ ధరలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో మే 12వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు తగ్గడం జరిగింది.
Also Read: పైసా ఖర్చు లేకుండా 6 లక్షల ప్రమాద భీమా – పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన స్కీం
అయితే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని మరికొందరు నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం అమెరికా చైనా మధ్య తగ్గుతున్న వాణిజ్య ఉద్రిక్తతలే అని చెబుతున్నారు.
మరోవైపు బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది మంచి అవకాశం గా చెబుతున్నారు. కానీ బంగారం ధరలు ఇప్పటికీ కూడా ఆల్ టైం రికార్డ్ స్థాయికి సమీపంలోనే ఉన్నాయి కనుక బంగారం కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా బంగారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు