Comedian Rakesh Died:గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు సినీ పరిశ్రమను నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇటు అభిమానులు కూడా తమ అభిమాన నటీనటుల మరణం తెలిసి కన్నీటి పర్యంతం అవుతున్నారు. సెలబ్రిటీ మరణాలకు ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం. ఇప్పుడు తాజాగా మరో యంగ్ కమెడియన్ రాకేష్ పూజారి (Rakesh pujari) కన్నుమూశారు. స్నేహితుడి ఇంట్లో మెహందీ వేడుకకు హాజరైన ఆయన, ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైద్యులు ఆయనను కాపాడలేకపోయారు. ప్రస్తుతం ఆయన వయసు 33 సంవత్సరాలే కావడం గమనార్హం. చిన్నవయసులోనే అందులోనూ గుండెపోటుతో మరణించడంపై ఇటు సినీ పరిశ్రమ, అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.. రాకేష్ పూజారి విషయానికి వస్తే.. పలు రియాల్టీ షో లతోపాటు కన్నడ, తుళు సినిమాలలో నటించారు. ఇక ఈయన మరణానికి కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినిమా సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రాకేష్ పూజారి కెరియర్..
రాకేష్ పూజారి 2020లో వచ్చిన కన్నడ రియాల్టీ టీవీ షో ‘కామెడీ ఖిలాడిగలు’ సీజన్ 3 ద్వారా బాగా పాపులర్ అయ్యారు. తన ప్రత్యేకమైన శైలి, హావ భావాలు, నటనతో అందరిని విపరీతంగా ఆకట్టుకున్నారు. అంతకుముందు సీజన్ 2 లో కూడా పాల్గొని ప్రస్తుతం కన్నడ పరిశ్రమలో టాప్ కమెడియన్లలో ఒకరిగా కొనసాగుతున్నార. ఇలాంటి సమయంలోనే సడన్గా గుండెపోటు వచ్చి ఆయన మరణించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే ఆయన మరణాన్ని అభిమానులు కూడా నమ్మలేకపోతున్నారు.
ALSO READ; Ram Charan: తండ్రి మైనపు విగ్రహం.. క్లీంకార్ రియాక్షన్ చూసారా..?
రాకేష్ పూజారి సినిమాలు..
ఒక రాకేష్ పూజారి రియాల్టీ టీవీ షో లతో పాటు కన్నడ, తుళు సినిమాలలో కూడా నటించారు. కన్నడలో ఇదు ఎంత లోకవయ్య, పైల్వాన్, వంటి చిత్రాలలో నటించిన ఈయన తులులో పెట్కమ్మి , ఇల్లోక్కెల్, అమ్మేర్ పోలీస్, పమ్మన్న ది గ్రేట్ వంటి చిత్రాలలో నటించారు. అంతేకాకుండా బలే తెలిపాలే, తుయినాయే పోయే వంటి కన్నడ రియాల్టీ షోలలో కూడా పాల్గొన్నారు. వీటితో పాటు పలు నాటకాలలో కూడా ఆయన చురుకుగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
.