E-Paper
Advertisement

తల లేదు, కాళ్లు లేవు… NTTPS కాలువలో కట్ చేసిన మొండం! అసలు ఎవరా మహిళ?

తల లేదు, కాళ్లు లేవు… NTTPS కాలువలో కట్ చేసిన మొండం! అసలు ఎవరా మహిళ?
Advertisement

Ibrahimpatnam Murder: ఇదొక సస్పెన్స్ మూవీ స్క్రిప్ట్‌లా అనిపిస్తోంది. ఇబ్రహీంపట్నంలోని NTTPS చన్నీటి కాలువలో ఒక గుర్తుతెలియని డెడ్‌బాడీ తేలింది. దాన్ని బయటకు తీసి అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆ డెడ్‌బాడీకి తల లేదు. చేతులు లేవు, కాళ్లు లేవు. కేవలం మొండం మాత్రమే ఉంది. దుండగులు ఆమెను ఎంత దారుణంగా నరికేశారంటే.. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు తల, చేతులు, కాళ్లను వేరు చేసి.. మొండాన్ని మాత్రమే ఆ కాలువలో పడేశారు. పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకొని వేట మొదలుపెట్టారు.

ఫార్మసీ ల్యాబ్ రిపోర్ట్‌..

Advertisement

ఇప్పుడు పోలీసుల చేతికి ఇంకో షాకింగ్ క్లూ.. ఒక కాలు… ఒక చేయి… అవి కూడా అదే కాలువలో దొరికాయి. క్లూస్ టీమ్ వెంటనే వాటిని ఫార్మసీ ల్యాబ్‌కు పంపింది. వాటిని పరిశీలించి డాక్టర్లు కొన్ని వైటల్ క్లూస్ బయటపెట్టారు. ఆనవాళ్లను బట్టి ఆ మహిళ వయస్సు సుమారు 40 ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఆ చేయి, కాలిపై ఉన్న కొన్ని ప్రత్యేకమైన గుర్తులను బట్టి చూస్తే.. ఆమె మార్వాడీ సమాజానికి చెందిన మహిళ అయి ఉండొచ్చని, లేదా జైన మతానికి చెందిన మహిళ కావచ్చని అనుమానిస్తున్నారు.

తల దొరికితేనే క్లైమాక్స్!

Advertisement

మొండం కాలు, చేయి దొరికింది ఇంకా దొరకాల్సిందేంటో తెలుసా? తల. ఆ ఒక్కటి దొరికితే… సగం కథ క్లైమాక్స్‌కి వచ్చేసినట్టే.. ఒక వైపు క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాను తలపించే ట్విస్టులు.. మరోవైపు మిస్టరీ వీడని ప్లాన్. రాష్ట్రవ్యాప్తంగా మిస్సింగ్ కేసులను ఆరా తీస్తూ.. ఆ మహిళ ఎవరనే దానిపై ఫోకస్ పెంచారు. సినిమాల్లో ఇంటర్వెల్‌కి ట్విస్ట్‌లు వస్తాయి… ఇక్కడ మాత్రం ప్రతి రోజూ ఓ కొత్త ట్విస్ట్ బయటపడుతుంది. మరి ఈ మిస్టరీ కేసుకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

Also Read: కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ డ్రామాలు బంద్ చేయాలి- బండి సంజయ్

Tags

Related News

పరీక్షల పేరుతో రక్తం పిండుతున్నారా? హుజూరాబాద్‌లో కార్మికుల శాంపిళ్ల సేకరణపై వివాదం!

కేసీఆర్ ఫాంహౌజ్‌పై కాంగ్రెస్ డ్రామాలు బంద్ చేయాలి- బండి సంజయ్

హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య వెనుక.. అనాథలైన కవలలు, గొడవలే అసలు కారణమా?

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

చికెన్, మటన్ షాప్‌లో మీకు ఇలా జరిగిందా.. అయితే బీకేర్ ఫుల్!

జూరాల డ్యామ్‌ వద్ద ఉత్కంఠ.. రైతుల ధర్నాతో పోలీసులు పహారా!

మేం అధికారంలోకి వస్తే చేసే మొట్టమొదటి పని ఇదే.. కవిత క్లారిటీ..?

Big Stories

Advertisement
×