Gold Rate Today: ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు.. బంగారు అభరణాలు ధరిస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. పలు రకాల డిజైన్లతో లక్షల్లో విలువ చేసే ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఆడవాళ్లకు ప్రతిరోజూ షాపింగ్ చేసిన బోర్ కొట్టదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు గోల్డ్ రేట్స్ తగ్గిద్దా.. ఎప్పుడు షాపింగ్ కి వెళ్గామా అని ఎదురు చూస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో ఎగబడుతారు. ఇటీవల రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. బంగారం పెట్టుబడిదారులకు ఆదరణ పొందుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.
ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్, విజయవాడలో22 క్యారెట్ల తులం బంగారానికి ఏకంగా రూ.1,050 పెరిగి, రూ. 92,850 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1140 పెరిగి,1,01,290 కి చేరుకుంది.
రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,00 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,440 కి చేరుకుంది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
1. అమెరికా డాలర్ బలహీనత
అమెరికా డాలర్ బలహీనపడితే.. బంగారం కొనుగోలు చేసే విదేశీ పెట్టుబడిదారులకు.. ఇది లాభదాయకంగా మారుతుంది. దీంతో బంగారం డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి.
2. ద్రవ్యోల్బణ భయాలు (Inflation Fears)
అమెరికాలో ఫెడ్ రిజర్వ్ లక్ష్యం కంటే.. ఎక్కువగా ద్రవ్యోల్బణం నమోదవుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలు, పెట్టుబడిదారులు బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా పరిగణిస్తారు.
3. కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు
చైనా, భారతదేశం, రష్యా వంటి దేశాల కేంద్ర బ్యాంకులు.. బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది బంగారానికి స్థిరమైన డిమాండ్‌ను కలిగిస్తోంది.
4. భయంకరమైన భవిష్యత్ ఆర్థిక పరిస్థితులు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, రెట్లు కట్టిన వడ్డీ రేట్ల ప్రభావం, జియోపాలిటికల్ టెన్షన్లు బంగారం పట్ల ఆశక్తిని పెంచాయి.
5. బంగారం ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లకు డిమాండ్
బంగారం-ఆధారిత ఎటిఎఫ్‌ల (ETFs) లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇది మార్కెట్లో డిమాండ్‌ను మరింత పెంచుతోంది.
6. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు.. బంగారం ధరలను ప్రోత్సహిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే బంగారంలో పెట్టుబడులు పెరుగుతాయి, ఎందుకంటే అప్పుడు బంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: సైకో ప్రేమికుడు.. అమ్మాయి పీక మీద కత్తి పెట్టి.. వైరల్ వీడియో
ప్రజలపై ప్రభావం
పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది భారంగా మారుతోంది.
చాలామంది ఇప్పుడు బంగారం కొనుగోలు సమయాన్ని వాయిదా వేస్తున్నారు.
నగల వ్యాపారులు కూడా కొనుగోళ్లపై ఆశావహంగా లేరు, ఎందుకంటే నగదు ప్రవాహం తగ్గిపోతుంది.
బంగారం ధరల మాదిరిగా.. వెెండి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కిలో వెండి ధర రూ.1,28,000 కి చేరుకుంది.