Pawan Kalyan HHVM: దాదాపు నాలుగేళ్ల శ్రమ తర్వాత వెండితెరకు రెండేళ్లు విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). జూలై 24వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్లలో హరిహర వీరమల్లు సినిమా విడుదల కాబోతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం (AM Ratnam) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్గా నటిస్తోంది. పలుమార్లు వాయిదా పడుతూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను ఇప్పుడు ఒక బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోందని చెప్పవచ్చు.
హరిహర వీరమల్లును వెంటాడుతున్న కొత్త సెంటిమెంట్..
అసలు విషయంలోకి వెళ్తే..మన హిందూ సాంప్రదాయం ప్రకారం భారతీయ సంస్కృతిలో తిధులకు విశేష ప్రాధాన్యత ఉంది.. ఏ పని మొదలు పెట్టాలన్నా సరే మంచి తిధి చూసుకొని మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో అయితే శుభకార్యాలు, ప్రయాణాలు లేదా ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటిది చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవ్వడం అందులోనూ.. అమావాస్య రోజునే రిలీజ్ కానుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సెట్స్ పై ఉండి.. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని చివరికి విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాని. ఉండుండి అమావాస్య రోజునే రిలీజ్ చేయడం చాలా మందికి నచ్చడం లేదు. అందుకే దీనిని ఒక బ్యాడ్ సెంటిమెంట్ గా చూస్తున్నారు.
చిత్ర బృందంపై నెటిజన్స్ ఫైర్..
అంతేకాదు చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా.. పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఆ సినిమా విడుదలకు సరైన సమయం, ముహూర్తం ఏమి చూసుకోరా? అంటూ మండిపడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి అమావాస్య రోజు విడుదలవుతున్న ఈ సినిమాపై దెబ్బ పడనుందా అనే కోణంలో కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ అమావాస్య నెగిటివ్ సెంటిమెంటును వీరమల్లు ఎలా బ్రేక్ చేస్తారో చూడాలి.
అలాంటి వాళ్ళు సినిమాకు రాకపోయినా నష్టం లేదు – ఇండస్ట్రీ వర్గాలు
ఇప్పుడు ఇలాంటి మాటలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు, సినీ ఇండస్ట్రీ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అమావాస్య సెంటిమెంటు వీరమల్లు పై పడితే కలెక్షన్లకు గండిపడే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి చిత్రాన్ని ఇలాంటి నెగటివ్ వైబ్స్ ఏం చేయలేవు. అసలు మొదటి రోజే అమావాస్య సెంటిమెంట్ ఉన్నవాళ్లు సినిమాకు రాకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. పవన్ ఫ్యాన్స్ తోనే సినిమా థియేటర్లు నిండిపోతాయి. ఇక సినిమాకి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఇక రెండవ రోజు ఆడియన్స్ ను ఆపడం ఎవరి తరం కాదు అంటూ సినీ వర్గాలు కామెంట్లు చేస్తున్నాయి. మరి ఈ అమావాస్య సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడో లేదో తెలియాలి అంటే జూలై 24 వరకు ఎదురు చూడాల్సిందే.
also read:Nidhhi Agerwal: ది రాజాసాబ్ లో నా పాత్ర అదే.. క్లారిటీ ఇచ్చిన నిధి అగర్వాల్!