Wasim Akram: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆయనకు అరుదైన గౌరవాన్ని అందించింది. అయితే ఈ విగ్రహం ఏర్పాటును హైదరాబాద్ మహానగరంలో చేయడం గమనార్హం. అదేంటి హైదరాబాద్ మహానగరంలో వసీం అక్రమ్ అనే పాకిస్తాన్ బౌలర్ విగ్రహం పెట్టడం ఏంటని అనుకుంటున్నారా? లేదా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర వసీం అక్రమ్ విగ్రహం పెట్టారని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పెద్ద పొరపాటే. పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ విగ్రహం ఏర్పాటు చేసింది… మన హైదరాబాదులో కాదు. పాకిస్తాన్ లో ఉన్న మరో హైదరాబాద్ నగరంలో… మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ విగ్రహం ఏర్పాటు చేశారు.
Also Read: Luckiest Batter: అదృష్టమంటే ఇదే…వికెట్లను తాకినా నాటౌటే.. అది కూడా 98 పరుగుల వద్ద
హైదరాబాద్ గడ్డపై పాకిస్తాన్ క్రికెటర్ విగ్రహం
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1984 సంవత్సరం నుంచి 2003 వరకు పాకిస్తాన్ జట్టులో కీలక ప్లేయర్ గా అలాగే కెప్టెన్ గా కూడా కొనసాగారు వసిం అక్రమ్. ఆ జట్టుకు ఎన్నో విజయాలు కూడా అందించిన ఆటగాడిలో ఒకరు ఈ వసీమ్ అక్రమ్. అలాంటి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కు అరుదైన గౌరవాన్ని అందించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విగ్రహాన్ని హైదరాబాద్ లోని నియాజ్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. అయితే హైదరాబాదులో వసీం అక్రమ్ విగ్రహం ఏర్పాటు చేశారని వార్త రావడంతో అందరూ తెలంగాణలోని హైదరాబాద్ అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వాస్తవానికి పాకిస్తాన్లో పంజాబ్ ఉన్నట్లే హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాదులోని నియాజ్ స్టేడియం పాకిస్తాన్ లో ఉంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అనేక సేవలు అందించినందుకు గాను గుర్తుగా ఆయన విగ్రహాన్ని తాజాగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వసీం అక్రమ్ విగ్రహంపై జోకులు
పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ విగ్రహం పోలికలపై సెటైర్లు పేల్చున్నారు. ఈ విగ్రహం 1992 ప్రపంచ కప్ జెర్సీలో ఉండడం గమనార్హం. అయితే హాలీవుడ్ నటుడు సిల్వర్ స్టార్ స్థాలోన్ తరహాలో ఈ విగ్రహం ఉందని… అసలు వసీం అక్రమ్ లాగా ఆ విగ్రహం లేదని సెటైర్లు పేల్చుతున్నారు.
Also Read:Rohit’s Lamborghini: రోహిత్ శర్మకు అవమానం…గిఫ్ట్ గా ఇచ్చిన కారును అమ్ముకున్న ఫ్యాన్ June 9,2
Temu version of Wasim Akram’s statue 😁🤭
After this: Wasim Akram stopped chatting with the lads in the morning.😁 https://t.co/grQTknTRE6— Sidra (@sidzu04) June 6, 2025