Gold Rate Today: పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధర భారీగా దిగొచ్చింది. ఈరోజు(జూన్ 17)న పసిడి ధర ఏకంగా రూ.1140 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,370 కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,000 వద్ద కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలోనూ.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టిన తీరు.. అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా యుద్ధ పరిస్థితుల సమయంలో పెట్టుబడిదారులు “సేఫ్ హావెన అసెట్” గా భావించే బంగారంపైనే.. ఎక్కువగా దృష్టి సారిస్తారు. అయితే ఇటీవల బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యాన్ని విశ్లేషిస్తే, కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
అమెరికా సహా పలు దేశాల్లో ద్రవ్యోల్బణం కాస్త తగ్గింది. దీని వల్ల పెట్టుబడిదారులు బంగారం వంటి సంపదపై నుంచి దృష్టిని మరలిస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs)ల్లో నుంచి పెట్టుబడిదారులు నిధులు విత్‌డ్రా చేసుకుంటున్నారు. దీనివల్ల మార్కెట్‌లో డిమాండ్ తగ్గడానికి కారణమవుతోంది. బంగారంపై అత్యధిక డిమాండ్ ఉన్న చైనా మార్కెట్ కూడా ప్రస్తుతం “స్లోడౌన్”లో ఉంది. ఇది అంతర్జాతీయ ధరలపై ప్రభావం చూపుతోంది.
నిపుణుల అభిప్రాయం:
పెట్టుబడిదారుల ఆందోళనలకు.. ఇది తాత్కాలికం మాత్రమేనని నిపుణులు భావిస్తున్నారు. యుద్ధ భయాలు మళ్లీ తీవ్రతరం అయితే.. బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి అయితే మార్కెట్లు మిక్స్‌డ్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి.
మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పీక్ స్టేజ్‌కి చేరుకుంది. రెండు దేశాలు తగ్గేదే లే అన్నట్లుగా ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా యుద్ధంలో చేరే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కెనడా పర్యటనను కుదించుకోవడం దీనికి బలం చేకూర్చుతుంది. జీ7 ట్రిప్ నుంచి ఆగమేఘాలపై అమెరికాకు బయలు దేరారు ట్రంప్. అమెరికాకు వెళ్లగానే భద్రతా మండలితో అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,000 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,370 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,000 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,370 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,370 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,520 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,150 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,520 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,520 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకెళుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,20,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,10, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.