Gold Rate Today: గోల్డ్ కొనుగోలు చేసేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,690 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,300 వద్ద కొనసాగుతోంది.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలకి ప్రధానంగా.. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ బలపడటం, వడ్డీ రేట్ల పెరుగుదల, స్థానిక డిమాండ్ తగ్గిపోవడం లాంటి అంశాలే కారణం. అయితే ఇది తాత్కాలిక తగ్గుదలగా భావించవచ్చు.
మరోవైపు ఇరాన్‌పై అమెరికా బాంబులు.. స్టాక్‌మార్కెట్‌పై గట్టిగానే పేలాయి. అన్ని సూచీలు ఎరుపెక్కాయి. భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమై.. అంతకంతకూ దిగజారిపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 850 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 260 పాయింట్లు పైనే కోల్పోయింది. ఐటీ కంపెనీలు అన్నిటికంటే ఎక్కువ నష్టాల్ని చవిచూశాయి. PSE సూచీకి అత్యల్ప నష్టాలు వచ్చాయి. నిఫ్టీ కీలకమైన 25వేల మార్క్‌ను కోల్పోయింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నా.. దాని ప్రభావం నుంచి మార్కెట్లు బయటపడ్డాయని భావించేలోగా.. అమెరికా ఎంట్రీతో బుల్స్ షాక్ తిన్నాయి. బేర్స్ బలపడ్డాయి. ఇరాన్‌లోని మూడు అణుశుద్ధి కర్మాగారాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినింది.
హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ తీసుకున్న నిర్ణయం కూడా స్టాక్ మార్కెట్ల జోరుకు ప్రతికూలంగా మారింది. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. మన దేశానికి రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతుండగా.., అందులో 2 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ జలసంధి నుంచే వస్తోంది. దాన్ని మూసేస్తే భారత్‌లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరగవచ్చు. మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. అటు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి. వీటన్నిటి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి.
బంగారం ధరలు ఇలా
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,300 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,690 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,300 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,690 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,00,690 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,300 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,00,840 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,450 వద్ద కొనసాగుతోంది.
Also Read: బైకు కొనలేం భయ్యా.. ఆ తేదీ నుంచి భారీగా పెరగబోతున్న ధరలు, ఎందుకంటే?
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాత్రం తగ్గుముఖం పడుతుంటే.. వెండి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,19,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,09, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.