Srikanth Iyengar : శ్రీకాంత్ కృష్ణ స్వామి అయ్యంగర్ (Srikanth Krishna Swamy Iyengar). తెలుగు సినిమా దర్శకుడిగా, నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. తెలుగులో దాదాపు 30కి పైగా చిత్రాలలో నటించారు.. 2013లో వచ్చిన ‘ఏప్రిల్ పూల్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. నిజానికి శ్రీకాంత్ అయ్యంగార్ తన చిత్రాల కంటే కూడా కొన్నిసార్లు అతి ఓవరాక్షన్ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంట్రవర్సీ మాటలతో ఈయన చేసే వ్యాఖ్యలు నెగిటివిటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి స్టేజ్ ఎక్కితే.. మీడియా ముందు హద్దులు దాటి మాట్లాడడం, నోటికి హద్దు అదుపు లేనట్టుగా వాగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు మనం ఏం మాట్లాడుతున్నాం..? ఎలాంటి భాష వాడుతున్నాం? అనే స్పృహ కూడా ఆయనలో ఉండదేమో అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.
కాంట్రవర్సీ మాటలతోనే భారీ పాపులారిటీ..
దీనికి తోడు గతంలో అనన్య నాగళ్ల (Ananya Nagalla) లీడ్ రోల్ లో వచ్చిన ‘పొట్టేల్’ సక్సెస్ మీట్ లో శ్రీకాంత్ అయ్యంగర్ మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం నిజంగా స్పృహలోనే ఉన్నాడా? అనే అనుమానం కూడా కలుగుతుంది. ముఖ్యంగా రివ్యూయర్లు నెగిటివ్ గా రాస్తారని, మేకర్లు, నటీనటులు అప్పుడప్పుడు కౌంటర్లు వేయడం సహజం.ఎంతో కష్టపడి తీసిన సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తే బాధ ఉంటుంది. కాబట్టి వాళ్లు కౌంటర్లు వేయడంలో తప్పులేదు.. కానీ తమ సినిమాకు నెగిటివ్ ఇచ్చారని బండ బూతులు తిట్టడం, నీచంగా మాట్లాడడం ఏమాత్రం తగదు.
ఇక శ్రీకాంత్ అయ్యంగార్ వాడిన పదజాలం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో శ్రీకాంత్ క్షమాపణలు చెప్పాలని కోరగా.. దిగి వచ్చిన ఈయన క్షమాపణలు కూడా తెలియజేశారు. అలా ఎప్పుడూ కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో నిలిచే ఈయన.. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో పంచుకుంటూ చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
ఇకపై నేను మీకు కనిపించను -శ్రీకాంత్ అయ్యంగార్
ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయంపై స్పందించే ఈయన తాజాగా అభిమానులకు శుభవార్త అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోలో.. నమస్తే అందరికీ శుభవార్త. “మీకోసం ఒక సూపర్, ఎక్స్ట్రార్డినరీ, మైండ్ బ్లోయింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాను. మరో నాలుగు నెలలు నేను ఇంస్టాగ్రామ్ లో కనిపించను. వ్యక్తిగత కారణాల వల్లే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ కి దూరంగా ఉండబోతున్నాను..బాయ్” అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు శ్రీకాంత్.
ALSO READ:Chiranjeevi: నేనూ ఓటీటీకి సిద్ధం.. ఆయనే నా రోల్ మోడల్.. గట్టి పోటీ ఇస్తానంటున్న చిరు!
శ్రీకాంత్ మాట నిలబెట్టుకుంటారా?
ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యక్తిగత కారణాలతో ఇంస్టాగ్రామ్ కి దూరం అవుతున్నానని చెప్పడంతో అసలేమైందో తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు. మరి మరో నాలుగు నెలల వరకు ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేయను అని చెబుతున్న శ్రీకాంత్ అయ్యంగర్ మాటమీద నిలబడతారా అనే విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.