Gold Rate Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడుతున్నాయి. లక్షరూపాయాలకు ఎగబాకిన పసిడి ధరలు దిగివస్తున్నాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 22 క్యారెట్ల తులం బంగారానికి రూ.550 తగ్గి, 89,300 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,420 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు:
అమెరికా ఫెడ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు.. బలహీనమవడం వల్ల డాలర్ విలువ బలపడుతోంది.
డాలర్ బలపడితే, బంగారం ధరలు పడిపోతాయి ఎందుకంటే బంగారం ప్రధానంగా డాలర్లలోనే ట్రేడవుతుంది.
జియోపాలిటికల్ టెన్షన్లు తగ్గడం:
మిడ్ ఈస్ట్, రష్యా-ఉక్రెయిన్ వంటి దేశాల మధ్య.. తాత్కాలికంగా ఉద్రిక్తతలు తగ్గడం వల్ల సేఫ్ హావెన్ (సురక్షిత పెట్టుబడి) అయిన బంగారంపై డిమాండ్ తక్కువైంది.
రూపాయి బలపడడం:
ఇండియన్ రూపాయి డాలర్‌పై కొంత బలపడటంతో.. దిగుమతి ధరలు కాస్త తగ్గాయి. ఇది కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది.
ఇన్వెస్టర్ల లాభాల తీసివేత:
గత కొన్ని వారాల్లో బంగారం భారీగా పెరిగిన నేపథ్యంలో, చాలా మంది పెట్టుబడిదారులు లాభాలు పొందేందుకు.. అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఇది మార్కెట్‌లో సరఫరా పెరగటానికి, ధరలు తగ్గేందుకు దారి తీస్తోంది.
చైనా డిమాండ్ తగ్గుదల:
చైనా వంటి దేశాల్లో బంగారం దిగుమతులపై నియంత్రణలు, ఆర్ధిక మందగమనం వంటి కారణాలు గ్లోబల్ డిమాండ్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,300 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,420 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,300 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,420 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,420 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,300 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,420 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,300 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,420 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,300 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,420 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: రాజ్యమార్గ్ యాత్ర యాప్‌లో కొత్త ఫీచర్.. టోల్ ట్యాక్స్ తగ్గించుకోండి ఇలా..
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు కూడా దిగొస్తున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,17,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,07, 800 వద్ద ట్రేడ్ అవుతోంది.