Jamun Seed Powder: ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (Diabetes )అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిలా విస్తరిస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం డయాబెటిస్ ఉన్న వారు చేయాల్సిన ముఖ్యమైన పని. దీనికి ప్రస్తుతం అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన హోం రెమెడీస్ కూడా డయాబెటిస్ తగ్గడంలో మేలు చేస్తాయి. కానీ చాలా మంది వీటిని అంతగా పట్టించుకోరు. ఇలాంటి వాటిలో నేరేడు పండు( జామూన్) గింజల పొడి కూడా ఒకటి.
నేరేడు గింజలు( Jamun Seeds) డయాబెటిస్ నియంత్రణలో ఎంతగానో ఉపయోగపడతాయి. అయినా వీటి యొక్క ప్రాముఖ్యత చాలా మందికి తెలియదు. ఇవి రక్తంలో చక్కెరను(Blood sugar) నియంత్రించగల శక్తివంతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. డయాబెడీస్ రోగులు నేరెడు గింజలను షుగర్ లెవెల్స్ తగ్గడానికి ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు జామూన్ సీడ్ పౌడర్ సూపర్ ఫుడ్ ?
బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గిస్తుంది:
జామూన్ గింజల( Jamun Seeds)లో ‘జాంబోలిన్’ ‘జాంబోసైన్’ అనే బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు స్టార్చ్‌ను చక్కెరగా మార్చే ప్రక్రియను నెమ్మది చేస్తాయి. తద్వారా భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
అధిక ఫైబర్ కంటెంట్:
నేరేడు గింజల పొడిలో పీచుపదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. అంతే కాకుండా ఇది రక్తంలో చక్కెర శోషణను క్రమంగా చేస్తుంది. ఇది ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. అనవసరమైన స్నాక్స్ తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. అంతే కకాకుండా బరువు నియంత్రణలో సహాయపడుతుంది .
యాంటీఆక్సిడెంట్ , యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు:
డయాబెటిస్(Diabetes ) తరచుగా శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును పెంచుతుంది. నేరేడు( Jamun ) గింజల పొడిలో ఎల్లాజిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ఈ యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డయాబెటిస్ సంబంధిత సమస్యలైన నరాల సంబంధిత సమస్యలతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
నేరేడు గింజల పొడి ప్యాంక్రియాస్‌లోని బీటా కణాల పనితీరును మెరుగుపరుస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ బీటా కణాలే శరీరంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. వాటి ఆరోగ్యం మెరుగుపడటం అంటే ఇన్సులిన్ ఉత్పత్తి మరింత సమర్థవంతంగా జరుగుతుందని అర్థం.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. నోటి పూతకు గుడ్ బై
అద్భుతమైన పోషకాలు:
నేరేడు గింజల పొడిలో విటమిన్లు ( విటమిన్ సి), ఖనిజాలు (కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం), ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఈ పోషకాలు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా.. డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా కనిపించే పోషకాహార లోపాలను కూడా సరిచేయడంలో సహాయపడతాయి.
ఎలా ఉపయోగించాలి ?
నేరేడు గింజల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చు. దీనిని స్మూతీలు లేదా ఇతర డ్రింక్స్‌లో కూడా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ఇది తక్కువ రోజుల్లోనే షుగర్ కంట్రోల్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.