Gold Rate Today: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఈరోజు(జున్ 13th) బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,950 వద్ద కొనసాగుతోంది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధ పరిణామాలతో చమురు, బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా 12 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వెస్ట్ టెక్సాస్ బ్యారెల్ ధర 12.6 శాతం పెరగగా.. బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 12.2 శాతం ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారమే పసిడి పది గ్రాముల ధర లక్ష రూపాయలు దాటి నమోదైంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బంగారం రేటు మరింతగా పెరిగే అవకాశముంది.
ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై దెబ్బ భారీగా తగిలింది. మదుపరులకు బిగ్ షాక్ తగిలింది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. సూచీలు, షేర్ల ధరలు అనూహ్య రీతిలో కుప్పకూలాయి. సెన్సెక్స్ రోజు కనిష్ట స్థాయికి దిగజారి.. 700 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 24,700 కంటే తక్కువ నమోదు అయింది. VIX 7% పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్మోజ్ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చనే ఆందోళనల మధ్య చమురు, బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,950 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,950 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,550 వద్ద ట్రేడ్ అవుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,950 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,400 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: వడ్డీ రేట్లు తగ్గడం.. టాటా మోటార్స్ ఊహించని ఆపర్లు, ఇంకెందుకు ఆలస్యం
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా.. వెండి ధరలు కూడా ఎన్నడూ లేని విధంగా.. రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,20,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,10, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.