Google Playstore Fraud Apps| ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులను టార్గెట్ చేసే కొన్ని ఫ్రాడ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో గత కొంతకాలంగా కనిపించాయి. క్రిప్టోకరెన్సీ వాలెట్ యాప్స్‌గా ఉన్న వీటిని నమ్మి చాలామంది వీటి ద్వారా లావాదేవీలు చేయాలని పెట్టుబడులు చేసి మోసపోయారు. అయితే ఇవి ప్రమాదకరమైన యాప్స్ అని పేర్కొంటూ గూగుల్ ప్లే స్టోర్ హెచ్చరిక జారీ చేసింది.
క్రిప్టో యాప్‌లతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్లే స్టోర్‌లోని కొన్ని మోసపూరిత యాప్‌లు ఉన్నాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. లేకపోతే దోపిడీకి గురయ్యే అవకాశం ఉంది. అందుకే యూజర్లు జాగ్రత్త వహించాలని.. గూగుల్ ప్లే స్టోర్ సుమారు 20 మోసపూరిత యాప్‌లను గుర్తించింది. ఈ యాప్‌లు సర్వీసుల లోగోలు, పేర్లు ఇతర ప్రముఖ, విశ్వసనీయ యాప్‌లను పోలీ ఉండడంతో యూజర్లు మోసపోయే అవకాశం ఉంది. ఇవి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యూజర్లకు ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు లేదా నకిలీ స్క్రీన్‌లకు వినియోగదారులను తీసుకెళ్లి, వారి మెమోనిక్ ఫ్రేజ్‌లను అడుగుతాయి.
మెమోనిక్ ఫ్రేజ్ అనేది ఒక రహస్య కోడ్, దాన్ని పొందిన వారు మీ క్రిప్టో ఆస్తులను సులభంగా దొంగిలించవచ్చు. సైబుల్ రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (CRIL) నివేదిక ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్‌లో 20కి పైగా ప్రమాదకర క్రిప్టోకరెన్సీ వాలెట్ యాప్‌లు కనుగొనబడ్డాయి. ఈ యాప్‌లు వినియోగదారుల వాలెట్ రికవరీ సమాచారాన్ని దొంగిలించి, ఖాతాలను పూర్తిగా హ్యాక్ చేయగలవు.
గుర్తించబడిన ఫ్రాడ్ యాప్‌ల జాబితా:
వెంటనే ఇలా చేయండి:
ఈ యాప్‌లను మీ ఫోన్ నుంచి తొలగించండి.
అధికారిక యాప్‌లలో మాత్రమే వాలెట్ రికవరీ ఫ్రేజ్‌ను ఎంటర్ చేయండి.
యాప్‌లను అధికారిక వెబ్‌సైట్ లేదా నమ్మదగిన సోర్స్‌ల నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి.
అదనపు భద్రత కోసం టూ-ఫాక్టర్ ఆథెంటికేషన్ (2FA)ని ఆన్ చేయండి.
మీ వాలెట్ యాక్టివిటీని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
యాప్‌లను తొలగించే విధానం:
ఫోన్‌లో సెట్టింగ్స్‌కు వెళ్లండి, ఆపై యాప్స్ ఎంచుకోండి.
అనుమానాస్పద యాప్‌ను సెలెక్ట్ చేసి, అన్‌ఇన్‌స్టాల్ బటన్‌ను నొక్కండి.
అన్‌ఇన్‌స్టాల్ చేయలేకపోతే, సెట్టింగ్స్ > సెక్యూరిటీ > డివైస్ అడ్మిన్ యాప్స్‌కు వెళ్లి, ఆ యాప్‌కు అనుమతులను నిలిపివేయండి.
Also Read: గూగుల్ ఎఐలో లోపాలు.. తప్పుడు సలహాలు, ప్రమాదకర సూచనలు
ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా మీ క్రిప్టో ఆస్తులను సురక్షితం చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్‌లను డౌన్‌లోడ్ చేసే ముందు రివ్యూలను తనిఖీ చేయండి. అధికారిక సోర్స్‌లను ధృవీకరించుకోండి. మీ ఫోన్‌లో ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే, వెంటనే యాప్‌ను తొలగించి, మీ వాలెట్ భద్రతను తనిఖీ చేయండి. అనవసర రిస్క్ తీసుకోవడం కంటే ముందు జాగ్రత్తగా ఉండడ ఉత్తమం.