Gold Rate Today: ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్ దాడులకు, కౌంటర్ అటాక్‌గా ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇరాన్ అటాక్స్‌కు మళ్లీ ఇజ్రాయెల్ గట్టిగా బదులిస్తోంది. దీంతో.. బాంబులు, క్షిపణుల మోతలు, డ్రోన్ దాడులతో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మధ్య చోటు చేసుకున్న యుద్ధ పరిణామాలతో చమురు, బంగారం ధరలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా 12 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వెస్ట్ టెక్సాస్ బ్యారెల్ ధర 12.6 శాతం పెరగగా.. బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 12.2 శాతం ఎగబాకింది.
మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా డాలర్ క్షీణత కారణంగా అంతర్జాతీయంగా పసిడి ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. దీంతో.. పుత్తడి ధరలు మళ్లీ లక్ష రూపాయల మార్క్‌ను దాటేశాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారమే పసిడి పది గ్రాముల ధర లక్ష రూపాయలు దాటి నమోదైంది. శనివారం రోజు బంగారం ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,680 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,200 వద్ద ట్రేడ్ అవుతోంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బంగారం రేటు మరింతగా పెరిగే అవకాశముంది.
ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్మోజ్ జలసంధి ద్వారా జరిగే గ్లోబల్ ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చనే ఆందోళనల నేపథ్యంలో చమురు, బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.93,200 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,680 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,200 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,680 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,200 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,680 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,350 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,830 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,200 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,680 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.93,200 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,01,680 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: కేవైసీ అప్డేట్.. ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,20,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,10, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.