BigTV English

Gaddar Awards: ఘనంగా గద్దర్ అవార్డ్స్.. ఒకే వేదికపై టాలీవుడ్ 4 పిల్లర్స్ ?

Gaddar Awards: ఘనంగా గద్దర్ అవార్డ్స్.. ఒకే వేదికపై టాలీవుడ్ 4 పిల్లర్స్ ?

Gaddar Awards: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే ఎదురవుతుంది అని అభిమానులు పాటలు పాడుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా  ప్రభుత్వం పెండింగ్ పెట్టిన గద్దర్ అవార్డ్స్ వేడుక ఎట్టకేలకు నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక అవార్డు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు. కళారంగంలో అత్యంత ప్రతిభ కనపరిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ  ఈ అవార్డులు దక్కనున్నాయి.  హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఎంతో గ్రాండ్ గా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారు రేవంత్ రెడ్డి సర్కార్. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న అవార్డులు కావడంతో చాలా పెద్ద లిస్ట్ నే రెడీ చేశారని తెలుస్తోంది. 2014 నుంచి2024 వరకు – తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలానికి గానూ ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించటం ఎంతో ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


 

ఇక  గత కొన్నిరోజుల నుంచి  గద్దర్ అవార్డులకు రావాలని టాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్న విషయం తెల్సిందే. ఈ వేడుక కోసం టాలీవడో మొత్తం ఏకమైందని టాక్ నడుస్తోంది. సినీ ప్రముఖులు అందరూ ఈ అవార్డ్స్ వేడుకలో పాలు పంచుకోనున్నారు. ముఖ్యంగా టాలీవుడ్  4 పిల్లర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్.. ఒకే వేదికపై కనువిందు చేయనున్నారనిసమాచారం.


 

టాలీవుడ్ ను ఏలుతున్న ఈ నలుగురు హీరోలు.. ఒకప్పుడు కలిసి కనిపించడం వేరు. ఇప్పుడు ఈ వేదికపై నలుగురు కనిపించడం వేరు. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత నెగిటివిటీ, అసలు సోషల్మీడియా నే లేదు కాబట్టి.. ఫ్యాన్ వార్స్, ట్రోల్స్, విమర్శలు, వివాదాలు ఏమి ఉండేవి కాదు. కానీ, సోషల్ మీడియా వచ్చాకా ఈ నలుగురు హీరోలకు ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆ ఫ్యాన్స్ మధ్య గొడవలు పెరిగాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొందరు. మీ హీరో ఇలా చేశాడు అంటే.. మీ హీరో అలా చేశాడు అని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కొట్టుకు చేస్తున్నారు.

 

మేము మేము బాగానే ఉంటాం.. మీరే మారాలి అని మహేష్ బాబు చెప్పినట్లు.. ఆ హీరోలు అంతా బాగానే ఉంటారు. మధ్యలో ఫ్యాన్ వార్స్ వలన వారిపై నెగిటివిటీ పెరగడం తప్ప ఇంకొకటి లేదు. మొదటి నుంచి కూడా చిరు, నాగ్, బాలయ్య, వెంకీ మంచి స్నేహితులు. నాగ్- వెంకీ బంధువులు. బయట కాకపోయినా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కలిసే కనిపిస్తారు. ఇక చిరు – బాలయ్య. ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్  మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. మెగా – నందమూరి ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది.

 

అయితే ఈ గద్దర్ వేడుకలు ఈ నలుగురు హీరోలను ఒకటిగా చేస్తుందని టాక్ వినిపిస్తోంది. చాలా కాలం తరువాత ఈ నలుగురు హీరోలు ఒకే స్టేజిపై కనిపించబోతున్నారు. ఫ్యాన్స్ విషయం పక్కన పెడితే.. ప్రేక్షకులకు ఆ సీన్ ఒక కన్నుల పండగ అని చెప్పొచ్చు . టాలీవుడ్ పిల్లర్స్ అయిన నలుగురు ఒకే ఫ్రేమ్ లో చూడడానికి అందరూ తహతహలాడుతున్నారు. మరి ఈ నలుగురు హీరోలు పక్కపక్కన నిలబడి ఫోటోలకు పోజులిస్తారా.. ? లేదా..? అనేది చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×