Today Gold Rate: పండుగలు, ఫంక్షన్స్ అంటే టక్కున గుర్తొచ్చేది బంగారమే. అంతలా మన సంస్కృతి, సాంప్రదాయాలకు ముడిపడింది ఈ లోహం(Gold). గత కొద్దిరోజుల నుంచి భారీగా దిగొచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరిగాయి. అసలే కార్తీకమాసం.. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో షాపులకు కొనుగోలుదారులు బారులు తీరడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు మంచి డిమాండ్ పెరగడంతో.. గోల్డ్ రేట్స్(Gold Rate) పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు అమాంతం పెరిగాయి. ఈరోజు(నవంబర్ 20) గోల్డ్ రేట్స్ చూస్తే..(నవంబర్ 20) గ్రాముకి పది రూపాయలు పెరిగి 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77, 620 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధరలు రూ.71,150 ఉన్నది. దీంతో పాటు 18 గ్రాముల తులం బంగారం ధర రూ.58,220 కి చేరుకుంది. ఇక ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
పసిడి ధరలు పరిశీలిద్దాం(Gold Rate)..
చెన్నైలో పసిడి ధరలు చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.77, 620 కి ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,150 కి చేరుకుంది.
రాజధాని ఢిల్లీలో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,230 కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ. 70,810 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
ముంబైలో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.77, 620 ఉంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,150 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో గోల్డ్ రేట్స్ చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,620 కి ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.71,150 కి చేరుకుంది.
కేరళ, కోల్‌కత్తాలో 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.77, 620 కి ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,150 వద్ద కొనసాగుతోంది.
Also Read: షాకింగ్.. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
ఏపీ, తెలంగాణలో గోల్డ్ రేట్స్ చూస్తే(Gold Rate)..
హైదరాబాద్, తెలంగాణలో.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77, 620 కి ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.71,150 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.77, 620 ఉంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.71,150 కి చేరుకుంది.
వైజాగ్, గుంటూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77, 620 కి ఎగబాకింది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.71,150 కి చేరుకుంది.
వెండి ధరలు ఇలా(Silver Rate)..
బంగారం ధరల మాదిరిగా వెండి ధరలు కూడా స్థిరంగా పెరుగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, కేరళ, ఏపీలో కిలో వెండి ధర రూ.1,01,000 వరకు పెరిగింది.
ఢిల్లీ, పుణె, బెంగుళూరు, ముంబైలో కిలో వెండి ధర రూ.92,000కి చేరుకుంది.