వాస్తవానికి సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు.. ఎప్పుడు విడాకులు ప్రకటిస్తారో తెలియదు. కొంతమంది లేట్ వయసులో పెళ్లికి సిద్ధమైతే, ఇంకొంతమంది సంవత్సరాలు తరబడి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండి, సడన్ గా విడాకులు ప్రకటిస్తారు. ఉదాహరణకు.. 29 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ.. సంగీత దర్శకులు ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (A R.Rahman) విడాకులు ప్రకటించారు. ఇప్పుడు మరొకవైపు 54 ఏళ్ల వయసులో ఒక సీనియర్ నటుడు వివాహానికి సిద్ధమవుతున్నారు. ఇవన్నీ వింటుంటే కాస్త విచిత్రంగానే వున్నా. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ విషయాలన్నీ కామన్ అయిపోయాయి.
54 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమవుతున్న శ్రీకాంత్ అయ్యంగర్..
ఇక మరోవైపు ఇండస్ట్రీలో సినిమాలపై ఫోకస్ పెట్టి, యంగ్ హీరోలంతా పెళ్లికి దూరంగా ఉంటే.. సీనియర్ నటులు మాత్రం పెళ్లి చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. గతంలో సీనియర్ నటుడు నరేష్ (V.K.Naresh ) ,పవిత్ర (Pavitra )లవ్ స్టోరీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. గత కొద్దిరోజులు వీరిద్దరూ వార్తల్లో కూడా నిలిచారు. అంతేకాదు ఇటీవల ఎం.ఎం. కీరవాణి(M.M.Keeravani )తనయుడు శ్రీ సింహ(Sri Simha) ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా నరేష్ – పవిత్ర జంట సందడి చేసింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో నటుడు 54 ఏళ్ల వయసులో పెళ్లి ప్రకటన చేస్తూ.. నెట్టింట పోస్ట్ చేశారు. ఆయన ఎవరో కాదు శ్రీకాంత్ అయ్యంగర్ (Srikanth Iyengar).
నటి జ్యోతితో పెళ్లికి సిద్ధం..
గత కొద్దిరోజులుగా పలు వివాదాస్పద పోస్ట్ లు, కామెంట్లు, బహిరంగ వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కూడా. ఇక ఇటీవల జర్నలిస్ట్ లను బూతులు తిడుతూ బహిరంగంగా చేసిన కామెంట్లకు జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతూ.. ఈయనపై చర్యలు తీసుకోవాలని మా కి కూడా లేఖలు పంపిన విషయం తెలిసిందే.. దీంతో దిగివచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఇలా నిత్యం వార్తల్లో నిలిచే ఈయన ఇప్పుడు మరొకసారి పెళ్లి వార్తల్లో నిలవడం ఆశ్చర్యంగా మారింది.
జ్యోతి ముద్దు పెడుతున్న ఫోటోతో కన్ఫామ్..
ప్రముఖ సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న జ్యోతి (Jyothy)తో ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీకాంత్.. తనకు నటి జ్యోతి ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేశారు.” క్రష్ ఆఫ్ మై లైఫ్.. మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా?” అంటూ రాసుకు వచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉండగా.. శ్రీకాంత్ ఒక్క ఫోటోతో కన్ఫర్మ్ చేసేసారు.. ఇంకా పెళ్లి ఒకటే వాయిదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇంకొంతమంది నెటిజన్స్.. ఒక అడుగు ముందుకేసి శ్రీకాంత్,నటి జ్యోతిల పెళ్లికి మనం కూడా వెళ్దాం అంటూ సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇందులో శ్రీకాంత్ ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టారో తెలియదు కానీ ప్రస్తుతం పెళ్లి వార్తలు ఊపందుకున్నాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">