BigTV English

Naina Ganguly: కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించాడు… అందుకే ఇండస్ట్రీకి దూరం

Naina Ganguly: కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించాడు… అందుకే ఇండస్ట్రీకి దూరం

Naina Ganguly: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడుగా పేరుపొందిన రాంగోపాల్ వర్మ(Ramgopal Varma) ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేశారు. ఇలా వర్మ కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టిన ముద్దు గుమ్మలలో నైనా గంగూలీ (Naina Ganguly)ఒకరు. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన “వంగవీటి” సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నైనా గంగూలీ అనంతరం వర్మ “డేంజరస్” సినిమాలో కనిపించి సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ నైనా గంగూలీ పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి ఈమె దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.


లైంగిక వేధింపులకు గురైన నటి…

ఇటీవల కాలంలో ఎలాంటి కొత్త ప్రాజెక్టుల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు దీంతో ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను తెలియజేయడమే కాకుండా గత కొంతకాలంగా తాను లైంగిక వేధింపులకు గురి అవుతున్నాననే సంచలన విషయాన్ని కూడా బయటపెట్టారు. తాజాగా నైనా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తాను మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని భావిస్తున్నాను. ఈ విషయాలన్ని పూర్తిగా నా వ్యక్తిగత విషయాలని తెలియచేశారు.

ప్రేమ హింసగా మారింది..


తాను గత మూడు సంవత్సరాల నుంచి ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదని తెలిపారు. తాను గత కొన్ని సంవత్సరాలుగా కోల్ కత్తాకు చెందిన ఒక కొరియోగ్రాఫర్ తో రిలేషన్ లో ఉన్నానని వెల్లడించారు. ఒకప్పుడు మా ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ, ఆప్యాయతలు ఉండేవి కానీ, ఇప్పుడు ఆ ప్రేమ హింసగా మారిందని, తనని తన ప్రియుడు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని వెల్లడించారు. ఇలా శారీరకంగా, మానసికంగా తాను పూర్తిగా కృంగిపోయానని నైనా గంగూలీ వెల్లడించారు.

ఆ వ్యక్తి కారణంగా తాను తన జీవితాన్ని కోల్పోయానని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నానని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఏంటీ? అనే విషయాలను అతి త్వరలోనే మీ అందరికీ తెలియ చేస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా తన ప్రియుడు చేతిలో మోసపోవడమే కాకుండా పెద్ద ఎత్తున లైంగిక వేధింపులకు గురి కావడంతోనే ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారని స్పష్టమవుతుంది. ఇక ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ వ్యక్తి ఎవరా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయం గురించి చర్చలు జరుపుతున్నారు.. మరి ఆ వ్యక్తి ఎవరో తెలియాలి అంటే స్వయంగా నటి నైనా గంగూలీ తెలియజేయాల్సి ఉంటుంది.

Also Read: Ranbir Kapoor: రణబీర్ కపూర్ కు షాక్ ఇచ్చిన ఎన్ హెచ్ఆర్సీ… చర్యలు తీసుకోవాలంటూ!

Related News

‎OG Censor : ‘ఓజీ’ ఇట్స్ A సర్టిఫికేట్ మూవీ… అయినా రెండు నిమిషాలు కట్ చేశారు

Dharma Wife: రాత్రిళ్ళు మాత్రమే ఫ్లాట్‌కి వస్తుంది.. క్యారెక్టర్ లేదా? రీతు చౌదరిపై ధర్మా భార్య గౌతమి ఫైర్!

‎Bhagyashri Borse : నువ్వుంటే చాలు… రామ్‌ కోసం భాగ్యశ్రీ కూని రాగం… రిలేషన్ కన్ఫామా ?

OG Trailer Late : ట్రైలర్ లేట్ అవ్వడానికి కారణం DI, AI కాదు… అంతా ప్రశాంత్ వర్మనే

‎Ranbir Kapoor: రణబీర్ కపూర్ కు షాక్ ఇచ్చిన ఎన్ హెచ్ఆర్సీ… చర్యలు తీసుకోవాలంటూ!

Balayya: బాలయ్య తెల్లవారుజాము 3 గంటలకు నిద్రలేచి చేసే పని ఇదేనట, వామ్మో!

OG Fever: ఓం.. ఓజాస్ గంభీరాయనమః… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ వైరల్ ఫీవర్

Big Stories

×