Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రణబీర్ కపూర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. హిందీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. బాలీవుడ్ లో ఈయనకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ కూడా ఉంది. ఇటీవల విడుదల అయిన యానిమల్ మూవీతో టాలీవుడ్ లో కూడా బాగానే అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా హీరో రణబీర్ కపూర్ కి సంబంచించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేమిటంటే.. సినిమాలోని ఒక సన్నివేశంలో రణబీర్ కపూర్ చేసిన పనికి ప్రస్తుతం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా రణబీర్ కపూర్ కి National Human Rights Commission (NHRC) ఊహించని షాక్ ఇచ్చింది. ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో ఎలాంటి హెచ్చరికలు లేకుండానే హీరో రన్బీర్ ఎలక్ట్రిక్ సిగరెట్ వేపింగ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సన్నివేశంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది NHRC.
వెంటనే చర్యలు తీసుకోవాలంటూ..
ఇది జాతీయ మానవ హక్కుల సంఘం కిందకు వస్తుంది. దానికి తోడు ఈ నిషేధిత వస్తువును ఎటువంటి హెచ్చరికలు లేకుండా సిరీస్ లో ఉపయోగించారు. కాబట్టి ఇది చట్ట ఉల్లంఘన కిందికి వస్తుందని ఎన్ హెచ్ఆర్సి అభిప్రాయపడింది. కాబట్టి పోలీసులు వెంటనే హీరోతో పాటు నిర్మాతలు నెట్ ఫ్లిక్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది. మరి పోలీసులు NHRC ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటారా, అలాగే నెట్ ఫ్లిక్స్(Netflix) లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ని ఆపేస్తారా లేదా అనేది చూడాలి మరి. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఆయన డైరెక్షన్ లో..
ఇకపోతే రణబీర్ కపూర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న రామాయణ(Ramayana) మూవీలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రణబీర్ రాముడు పాత్రలో నటిస్తుండగా సీత పాత్రలో సాయి(Sai Pallavi) పల్లవి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.
Also Read: Katrina Kaif: పెళ్లైన నాలుగేళ్లకు తల్లి అవుతున్న హీరోయిన్… బేబీ బంప్ ఫోటో వైరల్!