Today Gold Rate: 2025 కొత్త సంవంత్సరం రోజున బంగారం ధరలు భారీగా పెరిగి షాకిచ్చాయి. బంగారం కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే ముందునుంచి అంచనాలకు అనుగుణంగానే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలో ధరలు(Gold Rate) మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నేటి నుంచే ధరలు పెరగడం ప్రారంభించాయి. రేపు కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తూ.. కిలో వెండి ధర లక్షకు చేరువలో ఉంది.
ఇక భవిష్యత్తులో పసిడి కొనుగోలు చేయాలంటే గగనమే అని.. దాన్ని కొనాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే.. కొత్త ఏడాది మొదటి రోజు స్టాక్ మార్కెట్లు నస్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెలవు కావడంతో ఆసియా మార్కెట్ల నుంచి ఎలాంటి సాంకేతాలు రాలేదు. దీంతో మదుపరులు ఆచితూచి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధరకు.. రూ.400 మేర పెరిగి.. రూ.71,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారానికి రూ. 440 పెరిగి రూ.78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఏపీ, తెలంగాణలో పసిడి ధరలు ఇలా(Gold Rate)..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,500కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,500కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 78,000 కొనసాగుతోంది.
ఇక గుంటూరు, విశాఖపట్నంలో చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,500 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,650 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,150 పలుకుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000కి చేరుకుంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,500 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 ఉంది.
Also Read: వార్షిక ఆదాయం రూ.15 లక్షలు ఉంటే ఇన్‌కం ట్యాక్స్ తగ్గింపు.. కేంద్రం ప్లాన్
వెండి ధరలు ఇలా(Silver Rate)..
ఈరోజు(జనవరి1) బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, కేరళ, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.98,000 కి చేరుకుంది.
ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్ కత్తాలో కిలో వెండి ధర రూ.90,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.