Gold Market Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. దేశీయ కమోడిటీ మార్కెట్‌లో ఈ లోహాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వెండి ధర భారీగా దూసుకెళ్లగా, బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతానికి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీర్ఘకాలికంగా ధరలు పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టులో బంగారం ధరలు మునుపటి నష్టాల నుండి క్రమంగా కొలుకుంటున్నాయి. నెలలవారీగా పరిశీలిస్తే 14 శాతం లాభ పడినట్టు అంచనా వేశాయి.
అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోళ్లతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వారంరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల జోరు కాస్త తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో మిశ్రమ సంకేతాల ప్రభావం కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి క్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5 డాలర్లు పెరిగి 4643 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.03 శాతం తగ్గింది. ప్రస్తుతం 68 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో కాకుండా స్పాట్ మార్కెట్‌లో బంగారం-వెండి ధరలు స్వలంగా పెరిగాయి.
ఉదయం 9 గంటలకు బులియన్స్ వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,63,520గా ఉంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.130 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,49,890 వద్ద కొనసాగుతోంది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తాజా ధరలను పరిశీలించడం మంచింది.
వెండి ధరలు భారీగా పెరిగాయి. గత మార్కెట్ క్లోజింగ్‌తో పోలిస్తే కిలో వెండి ధర రూ.1,580 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,47,060 వద్ద కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‌లో బుధవారం ఉదయం బంగారం-వెండి ధరలు పెరుగుదల బాటలో నడుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కాసింత డౌన్‌ఫాల్ కనిపిస్తోంది.
న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 162,870 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.149,298లుగా ఉంది. ముంబై-24 క్యారెట్ల ధర రూ. 163,150 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 149,554 కొనసాగుతోంది. బెంగుళూరు, కోల్‌కతా, చెన్నై మార్కెట్లో ధరలు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. వెండి ధర న్యూఢిల్లీలో కేజి రూ. 245,770 పలుకుతోంది. ముంబైలో రూ. 246,190, బెంగళూరులో రూ. 246,390, కోల్‌కతాలో రూ. 243,220, చెన్నైలో వెండి కిలో ధర రూ. 246,730 కొనసాగుతోంది.
ALSO READ: చనిపోయిన కోటీశ్వరుడు.. భార్యకు ప్రతి నెలా రూ.1000 మాత్రమే.. ఎందుకంటే