E-Paper
Advertisement

కరెంట్ పోయినా నో టెన్షన్.. పవర్‌బ్యాంక్‌లా పనిచేసే నోకియా కొత్త ఫోన్ చూశారా?

కరెంట్ పోయినా నో టెన్షన్.. పవర్‌బ్యాంక్‌లా పనిచేసే నోకియా కొత్త ఫోన్ చూశారా?
Advertisement

Nokia 300 Charge: ఇప్పుడు వస్తున్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువ ఉండటంతో.. ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు మొబైల్‌తో పాటు పవర్‌బ్యాంక్‌ను కూడా మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇలాంటి సమయంలో ప్రముఖ మొబైల్ సంస్థ HMD ఒక వినూత్నమైన ఫీచర్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అదే ‘నోకియా 300 ఛార్జ్’.

అత్యంత దృఢమైన బాడీ, భారీ బ్యాటరీ లైఫ్‌తో వచ్చిన ఈ ఫోన్.. అవసరమైనప్పుడు వేరే ఫోన్లకు ఛార్జింగ్ కూడా ఇస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌ను ఫిలిప్పీన్స్ మార్కెట్‌లో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. అక్కడ దీని ధర దాదాపు రూ.3,400గా ఉంది.

40 రోజుల బ్యాటరీ బ్యాకప్..

Advertisement

ఈ Nokia 300 Charge ఫోన్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించే. నోకియా దీనిలో ఏకంగా 3700mAh రిమూవబుల్ బ్యాటరీని అమర్చింది. సాధారణంగా ఫీచర్ ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీ చూడటం చాలా అరుదు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 40 రోజుల పాటు స్టాండ్‌బై టైమ్, 37 గంటల టాక్‌టైమ్‌ను ఇస్తుంది. అంతేకాదు.. దీనిలో 10W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. అంటే ఈ ఫోన్‌ను ఒక పవర్‌బ్యాంక్‌లా వాడుకుని ఇతర ఫోన్లకు టైప్-సి పోర్ట్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని కోసం ఫోన్ పక్కన ఒక ప్రత్యేకమైన బటన్ కూడా ఇచ్చారు.

Also Read: 85 ఇంచుల బిగ్ స్క్రీన్, గూగుల్ జెమిని ఫీచర్.. హైయర్ నుంచి అద్భుతమైన స్మార్ట్ టీవీలు!

రగ్గడ్ డిజైన్, పవర్‌ఫుల్ టార్చ్ లైట్..

Advertisement

డిజైన్ విషయానికి వస్తే ఇది చూడటానికి చాలా రఫ్‌ అండ్ టఫ్‌గా ఉంటుంది. చేతిలో నుంచి జారిపడినా త్వరగా పాడవని రీతిలో దీని రూపురేఖలు ఉన్నాయి. సాధారణ ఫీచర్ ఫోన్లలో కెమెరా పక్కన ఉండే చిన్న ఎల్ఈడీ లైట్ కాకుండా.. ఈ ఫోన్ పైన ఒక పవర్‌ఫుల్ టార్చ్‌ను ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో లేదా చీకటి ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఈ లైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Nokia 300 Charge ఫీచర్లు..

ఈ ఫోన్ 2.4 ఇంచుల క్యూవీజీఏ డిస్‌ప్లేతో వస్తుంది. వెనుక వైపు సాధారణ కెమెరాను అందించారు. ఈ ఫోన్ యూనిసోక్ ప్రాసెసర్‌పై ఎస్30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలాగే దీనిలో 4MB ర్యామ్, 4MB అంతర్గత స్టోరేజ్ ఉన్నాయి. అయితే మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకునే సదుపాయం ఉంది. ఇది 2G నెట్‌వర్క్‌పై మాత్రమే పనిచేస్తుంది.

కలర్ ఆప్షన్స్ ఇవే..

Nokia 300 Charge బ్లాక్, గ్రీన్, శాండ్‌స్టోన్ కలర్లలో లభించే ఈ ఫోన్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాలింగ్ కోసం, అలాగే బ్యాకప్ ఫోన్‌లా వాడుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: Galaxy S27 Ultra కెమెరా రీ-డిజైన్.. Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్‌తో రాబోతుందా?

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×