E-Paper
Advertisement

85 ఇంచుల బిగ్ స్క్రీన్, గూగుల్ జెమిని ఫీచర్.. హైయర్ నుంచి అద్భుతమైన స్మార్ట్ టీవీలు!

85 ఇంచుల బిగ్ స్క్రీన్, గూగుల్ జెమిని ఫీచర్.. హైయర్ నుంచి అద్భుతమైన స్మార్ట్ టీవీలు!
Advertisement

Haier M70 Series: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ హైయర్.. భారత మార్కెట్లోకి తమ సరికొత్త M70 Mini LED టీవీ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం విజువల్స్, అద్భుతమైన సౌండ్ అనుభూతిని కోరుకునే వారి కోసం ఈ టీవీలను తీసుకొచ్చారు. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మొత్తం 5 విభిన్న సైజుల్లో ఇవి లభిస్తున్నాయి.

వివిధ సైజులు, ధరల వివరాలు:

హైయర్ M70 సిరీస్ 43 అంగుళాల నుంచి 85 అంగుళాల వరకు లభిస్తుంది. 43 అంగుళాల బేసిక్ మోడల్ ధర రూ.39,190 కాగా, 55 అంగుళాల మోడల్ రూ.56,590, 65 అంగుళాల మోడల్ రూ.74,990 ఉండగా.. 75 అంగుళాల మోడల్ ధర రూ.1,02,990గా ఉంది. ఇక లైనప్‌లో అతిపెద్దదైన 85 అంగుళాల మోడల్ రూ.1,69,990కి అందుబాటులో ఉంది. ఇవి అన్ని ప్రముఖ రీటైల్ స్టోర్లలో దొరుకుతాయి. ప్రతి టీవీపై మూడేళ్ల వారంటీని సంస్థ అందిస్తోంది.

Advertisement

Also Read: రూ.11,000 లోపే 6000mAh బ్యాటరీ ఫోన్.. మార్కెట్‌లోకి బోల్ట్ ఏస్ 5G, బోల్ట్ ఈవో!

అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ:

ఈ టీవీలలో వాడిన మిని LED టెక్నాలజీ, మైక్రో డిమ్మింగ్ వల్ల బ్రైట్‌నెస్ చాలా బాగుంటుంది. డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్‌తో ఇంట్లోనే సినిమా హాల్ లాంటి అనుభూతిని పొందవచ్చు. వీటిలోని AI పిక్చర్ క్వాలిటీ ఇంజిన్ స్క్రీన్ మీది కలర్స్, కాంట్రాస్ట్‌లను రియల్ టైమ్‌లో అడ్జస్ట్ చేస్తూ స్పష్టమైన బొమ్మను ఇస్తుంది. కళ్లకు అలసట కలగకుండా ట్యూవ్ రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఉంది.

గేమర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు:

Advertisement

ఇక గేమింగ్ ప్రేమికులకు ఈ టీవీలు బాగా నచ్చుతాయి. 120Hz DLG రిఫ్రెష్ రేట్, VRR, ALLM వంటి ఫీచర్లు ఉండటం వల్ల గేమ్‌లు చాలా స్మూత్‌గా, ఎలాంటి లాగ్ లేకుండా సాగుతాయి. టీవీలోనే ప్రత్యేకంగా ఇచ్చే గేమింగ్ బార్ ద్వారా సెట్టింగ్స్‌ను వేగంగా మార్చుకోవచ్చు. దీనిలోని షాడో ఎన్‌హాన్స్‌మెంట్ వల్ల చీకటి సన్నివేశాల్లో కూడా విజువల్స్ స్పష్టంగా కనిపిస్తాయి.

స్మార్ట్ ఫీచర్లు, ఆడియో క్వాలిటీ:

ఇందులో 50 వాట్ల 2.1 ఛానల్ స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండటం వల్ల బేస్, డైలాగ్‌లు చాలా క్లియర్‌గా వినపడతాయి. గూగుల్ టీవీ ఓఎస్‌పై పనిచేసే ఈ సిరీస్‌లో 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఉన్నాయి. గూగుల్ జెమిని వాయిస్ అసిస్టెంట్‌తో టీవీని సులభంగా ఆపరేట్ చేయవచ్చు. స్క్రీన్ ఆఫ్ చేసినా ఫోన్ నుండి పాటలు వినేందుకు బ్లూటూత్ స్పీకర్ మోడ్ వంటి సౌకర్యం కూడా ఉంది.

Also Read: ఇక వాట్సప్ స్టిక్కర్లకు కొదవలేదు.. ChatGPTలో క్రేజీ ఫీచర్.. మీ ఆలోచనలతోనే స్టిక్కర్లు!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×