Inzamam-ul-Haq On Abhishek sharma Duck Out: టీమిండియా వర్సెస్ జపాన్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో సెంచరీ హీరో అభిషేక్ శర్మ… తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ పరువు తీస్తూ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ వివాదాస్పద చేశారు. ఇండియా గడ్డపై అభిషేక్ శర్మ హీరో అవుతాడని… విదేశీ ట్రాక్లపై మాత్రం మనోడు జీరో అంటూ హేళన చేస్తూ కామెంట్స్ చేశారు. ఇండియాలో మాత్రమే అభిషేక్ శర్మ సెంచరీలు అలాగే అర్థ సెంచరీలు చేస్తాడని.. విదేశీ ట్రాక్లపై మాత్రం ఇలాగే డకౌట్ అవుతాడని పరువు తీశారు. ఈ విషయాలను తాము ముందు నుంచి చెబుతున్నామని.. అయినా కూడా అభిషేక్ శర్మ జపం చేస్తున్నారని సెటైర్లు పెంచారు ఇంజమామ్ వుల్ హక్. దీంతో అభిషేక్ శర్మపై ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
జపాన్తో జరిగిన ఏకైక టి20 మ్యాచ్ లో మనోళ్లు ఇరగదీస్తారని అందరూ అనుకున్నారు. 20 ఓవర్లలో 290 పరుగులు చేయడం గ్యారెంటీ అని అంచనా వేశారు. కానీ 5 ఓవర్లలో 32 పరుగులు చేయడానికి తిప్పలు పడ్డారు. అభిషేక్ శర్మ అయితే తొలి బంతికే చెత్త షాట్ ఆడి డకౌట్ అయ్యాడు. దీంతో అభిషేక్ శర్మ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు డకౌట్స్ లో కూడా మనోడు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు.. ఓకే క్యాలండర్ ఇయర్ లో 10 సార్లు డకౌట్ అయిన ఏకైక ఆటగాడిగా చెత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంతకుముందు తొమ్మిది సార్లు ఒకే ఇయర్ లో రషీద్ ఖాన్ డక్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు ఆ రికార్డును అభిషేక్ శర్మ బ్రేక్ చేశాడు.
టీమిడియా వర్సెస్ జపాన్ మధ్య జరిగిన మ్యాచ్ పై తన్వీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంపైర్ ను బెదిరించి టీమిండియా విజయం సాధించిందని ఆరోపణలు చేశారు. అక్షర్ పటేల్ వేసింది వైడ్ బాల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంపైర్ దీన్ని వైడ్ గా ప్రకటించినప్పటికీ కూడా.. అతడిని బెదిరింపులకు గురి చేశారని తన్వీర్ అహ్మద్ ఆరోపణలు చేశారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కు ( I C C) సంబంధించిన పెద్దలందరికీ లేఖలు రాస్తానని వార్నింగ్ ఇచ్చారు. వదిలేస్తే టీమిండియా మరిన్ని ఘోరాలు చేసే ప్రమాదం ఉందని తెలిపారు.