Ninnu kori serial today Episode: సామ్రాట్ ప్రాణాలతో దక్కడని కానీ సామ్రాట్‌కు గతం గుర్తుకు లేదన్న బాధ తనను వేధిస్తుందని దాక్షాయణి కేశవతో ఎమోషనల్ అవుతుంది. కేశవ దాక్షాయనిని ఓదారుస్తుంటాడు. అంతా చాటు నుంచి సామ్రాట్ వింటుంటాడు. అమ్మ తప్ప వాడికి వేరే ప్రపంచమే లేదు. వాడు తప్పా నీకు వేరే ప్రపంచమే తెలియదు. మీ ఇద్దరిదీ చాలా గొప్ప బంధం అంటూ కేశవ చెప్తుంటాడు. అంతా వింటున్న సామ్రాట్ ఇంత ప్రేమ చూపిస్తున్న మనిషిని నేను మర్చిపోవడం ఏంటి..? నాకు గుర్తు లేకపోయినా అమ్మను బాధపెట్టకూడదు అనుకుంటాడు సామ్రాట్.
హాల్లో సామ్రాట్ పేపర్ చదువుతూ ఉంటే.. జీవన్ కొన్ని పేపర్లు పట్టుకుని వచ్చి అమ్మ ఇక్కడ లేదు.. అన్నయ్య ఒక్కడే ఉన్నాడు ఇప్పుడే ఆస్థి పేపర్ల మీద సంతకం చేయించుకుంటే సరిపోతుంది. అనుకుంటూ దగ్గరకు వెళ్లి రైస్ మిల్లుకు చెందిన లెక్కల పేపర్లు ఇవి బ్యాంకులో సబ్మిట్ చేయాలి నువ్వు సంతకాలు చేస్తే వెళ్తాను అంటాడు. పేపర్స్ తీసుకుని సామ్రాట్ సంతకం చేస్తాడు. ఆ పేపర్స్ తీసుకుని జీవన్ వెళ్లిపోతాడు. తర్వాత సామ్రాట్, మదన్, చంద్ర, దాక్షాయణి, కేశవ మాట్లాడుతుంటే.. జీవన్ ఫైల్ పట్టుకుని వస్తాడు. ఏంటి జీవన్ బ్యాంకుకు వెళ్లలేదా..? అని అడిగితే వెళ్లాను కానీ నీ సంతకం మ్యాచ్ అవ్వలేదని చెప్పారు అని చెప్తాడు. ఏంటి సంతకం మ్యాచ్ అవ్వడం లేదా..? ఇటివ్వు అంటూ పేపర్లు తీసుకుని చూస్తాడు సామ్రాట్. అందులో విరాట్ పేరుతో సంతకం ఉంటుంది.
దాక్షాయణి పేపర్స్ తీసుకుని చూసి షాక్ అవుతుంది. అదేంటి విరాట్ అనే పేరుతో సంతకం చేశావని అడుగుతుంది. ఆ మాట వినగానే.. చంద్ర హ్యాపీగా ఫీలవుతుంది. విరాట్ ఎవరు అంటూ శ్రీజ వస్తుంది. విరాట్ తానేనని నా పేరే విరాట్ అని సామ్రాట్ చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. నీ పేరు విరాటా..? అని దాక్షాయణి అడిగితే.. అవునని తాను హాస్పిటల్ లో ఉన్నప్పుడు వీళ్లు నన్ను పిలిచింది అదే పేరుతో అని చెప్తాడు సామ్రాట్. శ్రీజ వేసిన క్వశ్చన్స్‌కు సామ్రాట్ కన్ఫీజ్ అవుతుంటాడు. వాడి గురించి వాడికే గుర్తు లేదు నువ్వు అడిగితే ఏం చెప్తాడమ్మా అంటాడు. దాక్షాయణి మాత్రం జీవన్‌ను అనుమానిస్తుంది. ఎప్పుడూ లేనిది రైస్ మిల్ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు అని పేపర్స్ మొత్తం చూస్తుంది. కోపంగా జీవన్‌ను చూస్తుంది. జీవన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
తర్వాత చంద్ర చాలా హ్యపీగా ఫీలవుతుంది. మదన్ వెళ్లి ఏంటి చంద్ర గారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అడిగితే.. అవునని విరాట్ కు గతం గుర్తుకు వస్తుందన్న నమ్మకం పెరిగిందని చెప్తుంది. అయితే మీరు ఇలాగే విరాట్ గారికి గతం గుర్తుకు వచ్చేలా చేయండని చెప్తాడు. చేస్తాను కానీ అందుకు ఒక అడ్డంకి ఉందని అవి అధిగమించాలని చెప్తుంది చంద్ర. ఇంట్లో వాళ్లను ఎలాగైనా మ్యానేజ్ చేయాలి అంటే.. ఇంట్లో వాళ్లను ఎలా మాయ చేయాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను అంటాడు మదన్.
తర్వాత జీవన్ దగ్గరకు వెళ్లిన దాక్షాయణి ఇంకోసారి ఇలాంటి పని చేస్తే చంపేస్తానని తిడుతుంది. అప్పుడే జీవన్ కోపంగా దాక్షాయణిని ఎందుకమ్మా నీకు ఈ కన్నకొడుకు కన్నా ఆ పెంపుడు కొడుకు మీద అంత ప్రేమ. చిన్నప్పటి నుంచి నువ్వు అన్నయ్యకే ఎక్కువ ప్రేమను పంచావు.. నన్ను ఎప్పుడూ చిన్న చూపే చూశావు అంటూ ప్రశ్నిస్తాడు. చాటు నుంచి అంతా వింటున్న చంద్ర షాక్ అవుతుంది. పుట్టినప్పటి నుంచి కాదురా నీ బుద్ది తెలిసినప్పటి నుంచిరా నేను ఎన్నిసార్లు మందలించినా నువ్వు మారలేదు. నేను నా కొడుకు ఎలా ఉండాలి అనుకున్నానో అలా పెరిగాడు. వాడు నా కడుపున పుట్టలేదు.. కానీ ఇప్పుడు వాడికి ఆ విషయం గుర్తు లేదు. నా వెలితి తీరుతుంది.
నేను పెంపుడు తల్లిని అని తెలిసినా కూడా వాడు ఏ రోజు ఆ ఫీలింగ్ చూపించలేదు. నువ్వు నా కన్నకొడుకువి అయినా నా మాట వినలేదు.. అంటూ తిడుతుంది. అంతా విన్న చంద్ర హ్యాపీగా ఫీలవుతుంది. అప్పుడే బయటకు వచ్చి చంద్రను చూసిన దాక్షాయణి షాక్ అవుతుంది. చంద్ర ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే చంద్ర డైరెక్టుగా మీరు సామ్రాట్ గారి కన్నతల్లి కాదా..? అని అడుగుతుంది. అందుకు దాక్షాయణి షాక్ అవుతుంది. విన్నది విన్నట్టే మర్చిపో అంటూ చంద్రకు చెప్తుంది. సామ్రాట్‌కు అసలు ఏ విషయం చెప్పొద్దు అంటూ మాట తీసుకుంటుంది దాక్షాయణి. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.