Gold Price Today: ఇరాన్-అమెరికా మధ్య ఉద్రికత్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. దాని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడుతోంది. ఈ క్రమంలో బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఇరాన్‌పై మునుపెన్నడూ లేని విధంగా ఆర్థిక చర్యల గురించి అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్ హెచ్చరించిన తర్వాత భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలు ఏ విషయంలోనూ వెనక్కి తగ్గలేదు. దీనికిదోడు రష్యా- ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకర దాడులు మొదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకోవడంపై అనిశ్చితి నెలకొంది. ఫలితంగా ముడి చమురు ధరలు భారీగా ఎగబాకుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుదారులు అమ్మకాలకు పాల్పడడంతో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. ఇప్పటివరకు నమోదైన గరిష్టాల నుంచి మెల్లగా ధరలు దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు దేశీయంగా ఆయా లోహాల ధరలు పతనం అయ్యాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4385 డాలర్లు వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. సిల్వర్ రేటు 65.44 డాలర్ల స్థాయిలో ఉంది. డాలరుతో రూపాయి విలువ రూ. 95.46 స్థాయి మధ్య అటు ఇటు కదలాడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్-MCX విషయానికొస్తే.. గోల్డ్ ఫ్యూచర్స్ 0.8 శాతం లేదా రూ. 1,233 మేరా క్షీణించింది. శుక్రవారం ఉదయం 10.22 గంటల సమయానికి ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరి రూ. 1,52,233 వద్దకు ట్రేడింగ్ జరిగింది. చివరకు 0.68 శాతం తగ్గి, రూ. 1,52,415 వద్ద ట్రేడవుతోంది. మునుపటి ముగింపుతో పోలిస్తే 0.17 శాతం లేదా రూ. 266 తక్కువ అని ఐఏఎన్ఎస్ పేర్కొంది. రెండు నెలల గరిష్టాల నుంచి ధరలు దిగి రావడంతో కొనుగోలుదారులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు పెద్దగా తగ్గకపోయినా, దేశీయంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్-దేశీయంగా బంగారం- వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.
తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్-విజయవాడ నగరాల్లో బంగారం-వెండి ధరలను చూద్దాం. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 710 తగ్గడంతో తులం రూ. 1,52,890 కి పడిపోయింది. అంతకుముందు రోజు రూ. 1260 మేరా పతనమైంది. 22 క్యారెట్లకు చెందిన బంగారు ఆభరణాల ధర రూ. 650 పతనమైంది. తులానికి రూ. 1,40,150 వద్ద కొనసాగుతోంది. ఆగస్ట్ 14న రూ. 1150 మేరా తగ్గింది. గతవారంతో పోల్చితే ఈ వారం రోజులు రూ. 7 వేలకుపైగా ఎగబాకింది.
ALSO READ: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్-డీజిల్-ఏటీఎఫ్ ట్యాక్స్ తగ్గింపు, అర్థరాత్రి నుంచి అమలు
బెంగళూరులో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు ధర రూ.1,52,880 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల రూ.1,40,140 గా ఉంది. చెన్నై మార్కెట్‌లో రూ.1,53,160 వద్ద ఉండగా, 22 క్యారెట్ల రూ.1,40,390 వద్ద విక్రయమవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,53,030 వద్ద ఉండగా 22 క్యారెట్ల ధర రూ.1,40,290 వద్ద కొనసాగుతోంది.
బంగారంతో పాటు వెండి ధరలు దిగివచ్చాయి. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం కిలో వెండిపై తగ్గింపు నమోదైంది. శనివారం ఉదయం 7 గంటల సమయంలో వెండి ధర రూ. 5 వేలు తగ్గింది. ప్రస్తుతం కేజీకి రూ. 2.55 లక్షల వద్ద కొనసాగుతోంది. గడిచిన రెండు వారాల్లో రూ. 25 వేలు పెరగ్గా కేవలం రూ. 5 వేలు మాత్రమే పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రధాన ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద కొనసాగుతోంది. దీనికి నాలుగైదు వందలు అటు ఇటుగా మిగతా మార్కెట్లో ధరలు ఉన్నాయి.