Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. స్టాక్ మార్కెట్లతోపాటు బులియర్ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. ఫలితంగా సూచీలు పతనం, బంగారం ధరలు దిగిరావడం జరుగుతోంది. గడిచిన రెండురోజులుగా బంగారం ధర రూ.4500 తగ్గింది. కిలో వెండి ధర రూ.11 వేలు తగ్గింది. దీంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు.
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మూడేళ్లలో తొలిసారిగా వడ్డీ రేట్లను పెంచడం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, మార్కెట్ల బలహీనత సంకేతాలు ప్రభావం బులియన్ మార్కెట్‌పై పడింది. దీంతో పెట్టుబడుదారులు ఆయిల్, డాలర్లు, బ్రాండ్లపై మొగ్గు చూపడంతో బంగారం ధరలు దిగి వస్తున్నాయి. సెప్టెంబర్ 30న ఉదయం సెషన్‌లో స్పాట్ గోల్డ్ 1.42 శాతం పెరిగి ఔన్సుకు 4,173 డాలర్ల వద్ద కదులుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ 0.54 శాతం పెరుగుదలతో ఔన్సుకు 4,202 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. ఫలితంగా బంగారం-వెండి ధరల్లో గణనీయంగా మార్పులు జరుగుతున్నాయి.
సెప్టెంబర్ 30 ఉదయం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,48,790 ఉండగా, 22 క్యారెట్ల పసిడి రూ.1,36,390 వద్ద కొనసాగుతోంది. సెప్టెంబర్ 29న అనగా మంగళవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 313 తగ్గి రూ. 1.48 లక్షలకు చేరింది. కిలో వెండి ధర రూ.1,453 తగ్గి రూ.2.22 లక్షలకు చేరింది. కేవలం రెండు రోజుల్లో బంగారం ధర సుమారు రూ. 4,500, వెండి ధర రూ. 11,000 మేరా తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కట్లో ఇవాళ బంగారం-వెండి ధరలను పరిశీలిద్దాం. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,48,790 ఉంది. అదే 22 క్యారెట్ల ధర రూ.1,36,390 వద్ద కొనసాగుతోంది. వెండి కిలో ధర రూ.2,33,900 ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,48,940 వద్ద ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,540 వద్ద ఉంది. ఇక ముంబై, బెంగుళూరు, కోల్‌కత్తా వంటి నగరాల్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,48,790 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,36,390 గా ఉంది.
ALSO READ: అత్యవసరంగా డబ్బు కావాలా? మీ పిపిఎఫ్ అకౌంట్ నుంచి ఈజీ లోన్ లభిస్తుందిగా