E-Paper
Advertisement

రూ.106 వల్ల ఇన్సూరెన్స్ కట్.. బ్యాంక్‌కు ఊహించని షాక్.. రూ. 1.5 లక్షల జరిమానా!

రూ.106 వల్ల ఇన్సూరెన్స్ కట్.. బ్యాంక్‌కు ఊహించని షాక్.. రూ. 1.5 లక్షల జరిమానా!
Advertisement

Bank Insurance Negligence: బీమా ప్రీమియం జమ కాలేదనే విషయాన్ని ఖాతాదారునికి తెలియజేయడంలో విఫలమైన బ్యాంక్ కు వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. బ్యాంక్ సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్ల ఖాతాదారుడి కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలని ఆదేశించింది. బాధిత కుటుంబానికి రూ.1.5 లక్షల పరిహారాన్ని అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ తీర్పు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అసలేం జరిగిందంటే?

పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాకు చెందిన బాధితుని కుమార్తె సదరు బ్యాంకులో సేవింగ్స్ ఖాతాను కలిగి ఉంది. ఆమె కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన’ (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana)పథకంలో చేరి ప్రతి ఏటా ఖాతా నుంచి ఆటో డెబిట్ (ఆటోమేటిక్ డెడక్షన్) ద్వారా ప్రీమియం చెల్లించేలా ఆప్షన్ ఎంచుకుంది. అయితే ఈ క్రమంలోనే సదరు యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన తర్వాత భీమా పరిహారం కోసం తండ్రి బ్యాంకును సంప్రదించగా.. 2021-22 సంవత్సరానికి గాను ప్రీమియం చెల్లించకపోవడం వల్ల పాలసీ రద్దయిందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.

రూ.106 బాకీ వల్ల రద్దయిన పాలసీ

Advertisement

బ్యాంక్ స్టేట్‌మెంట్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. భీమా ప్రీమియం రూ. 330 కట్ చేయడానికి బ్యాంక్ ప్రయత్నించగా ఆ సమయంలో యువతి ఖాతాలో కేవలం రూ. 223.42 మాత్రమే ఉన్నాయి. దీంతో రూ. 106.58 స్వల్ప లోటు వల్ల డెబిట్ ఎంట్రీని బ్యాంకు రివర్స్ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ యువతి తన ఖాతాలో రూ. 1,000 డిపాజిట్ చేసినప్పటికీ బ్యాంక్ భీమా పాలసీని పునరుద్ధరించలేదు. పైగా ప్రీమియం కట్ కాలేదనే విషయాన్ని కూడా ఖాతాదారునికి తెలియజేయలేదు.

బ్యాంక్ వాదనను తోసిపుచ్చిన కమిషన్

బ్యాంక్ తప్పును ఎత్తిచూపుతూ యువతి తండ్రి వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా బ్యాంకు తన వాదనలు వినిపిస్తూ.. చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. సరిపడా బ్యాలెన్స్ ఉంచుకోవాల్సిన బాధ్యత ఖాతాదారుడిదేనని, ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం అందనందున తాము బాధ్యులం కామని బ్యాంక్ వాదించింది. అయితే కమిషన్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ కుమార్ చోప్రా, సభ్యురాలు మందీప్ కౌర్‌లతో కూడిన ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. ఆటో డెబిట్ విధానాన్ని బ్యాంకే బాధ్యతగా తీసుకున్నప్పుడు సిస్టమ్ వైఫల్యం అని చెప్పి చేతులు దులుపుకోలేరని స్పష్టం చేసింది. బ్యాలెన్స్ లేక లావాదేవీ విఫలమైనప్పుడు ఆ విషయాన్ని ఖాతాదారునికి తెలపాల్సిన కనీస బాధ్యత బ్యాంకుపై ఉందని పేర్కొంది.

Advertisement

Also Read: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే.. జైలులో పెడతారా? చట్టం ఏం చెబుతోంది?

బ్యాంక్‌కు భారీ పరిహారం

సమయానికి సమాచారం ఇవ్వకపోవడం బ్యాంకు తప్పిదమేనని వినియోగదారుల కమిషన్ నిర్ధారించింది. ఈ నిర్లక్ష్యానికి గాను బాధిత తండ్రికి రూ. 1.5 లక్షల పరిహారంతో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 10,000 చెల్లించాలని ఆదేశించింది. దీంతో బాధిత కుటుంబానికి ఊరట లభించినట్లైంది.

Also Read: ట్రాయ్ టెలికాం యూజర్ల గణాంకాలు.. Jio, Airtelకి షాకిచ్చిన BSNL.. పాపం చతికిలపడ్డ వీఐ!

Tags

Related News

ఇతర బ్యాంకులో తక్కువ వడ్డీకి హోమ్ లోన్.. మీ బ్యాంకు నుంచి లోన్ ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ఇది తెలుసుకోండి

క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోతే.. జైలులో పెడతారా? చట్టం ఏం చెబుతోంది?

ప్రతి నెలా డబ్బు ఆదా చేయలేకపోతున్నారా? ఖర్చులు తగ్గించుకోవడానికి బదులుగా ఈ ట్రిక్ ట్రై చేయండి!

పిల్లల పేరుతో SIPలో పెట్టుబడి చేస్తున్నారా? 18 ఏళ్లు నిండిన తరువాత జరిగే మార్పులివే

భారీగా పడిపోతున్న పసిడి ధర.. మార్కెట్లో ధరల మాటేంటి? ఈనెలలో ఎంత తగ్గింది?

బాబూ ఈ డిగ్రీలు చేస్తే ఉద్యోగాల్లేవ్.. ఏఐ దెబ్బ.. తక్కువ జీతానికి చేయాల్సిందే

నలుపు vs నీలం సోలార్ ప్యానెళ్లు.. ఏది ఎక్కువ కరెంట్ ఇస్తుంది? మీ ఇంటికి ఏది బెస్ట్?

Big Stories

Advertisement
×