E-Paper
Advertisement

కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌-డీజిల్-ఏటీఎఫ్‌‌లపై ట్యాక్స్ తగ్గింపు, అర్థరాత్రి నుంచి అమలు

కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌-డీజిల్-ఏటీఎఫ్‌‌లపై ట్యాక్స్ తగ్గింపు, అర్థరాత్రి నుంచి అమలు
Advertisement

Govt Cuts Windfall Tax: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్- డీజిల్- ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌ ఎగుమతులపై విధించే విండ్‌ ఫాల్ టాక్స్ తగ్గించింది. ఆ ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంతకీ విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏమిటి? దీనివల్ల సామాన్యుడికి ఊరట లభిస్తుందా? అన్నదానిపై డీటేల్‌గా చూద్దాం.

 

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisement

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ప్రతీ రెండువారాలకు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తోంది. రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయక పోయినా గతంలో విధించిన పన్నులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈసారి విండ్‌ఫాల్ టాక్స్ రేట్లను సవరించింది. ఆగస్ట్ 15న విండ్‌ఫాల్ టాక్స్ గెయిన్స్ తగ్గించింది. భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ ఫ్యూయల్‌పై విండ్ ఫాల్ పేరిట ట్యాక్స్ విధిస్తుంది. ఇప్పుడు ఆ టాక్స్ తగ్గించడంతో విదేశాలకు ఇంధనం ఎగుమతి చేసి లాభాలను ఆర్జించవచ్చు. దీనివల్ల రిలయన్స్, ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా వంటి చమురు సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరనుంది.

 

అర్ధరాత్రి నుంచి పెట్రోల్‌-డీజిల్-ఏటీఎఫ్‌‌లపై ట్యాక్స్ తగ్గింపు

Advertisement

ఆగష్టు 14 వరకు పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు విండ్‌ఫాల్ టాక్స్ రూ. 3.5 గా ఉండేది. ఇప్పుడు దాన్ని జీరోకు పరిమితం చేసింది. అదే సమయంలో డీజిల్‌పై లీటరుకు రూ. 25.5 గా ఉండేది. తాజాగా దాన్ని రూ. 24 కు పరిమితం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. విమాన ఇంధనంపై (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ లేదా జెట్ ఫ్యూయెల్) లీటరుపై టాక్స్ రూ. 22 గా ఉండేది. ఇప్పుడు రూ. 19.5 కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించినంత మాత్రాన పెట్రోల్-డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు.

 

ఎగుమతి చేసేవారికి కాసుల పంట

దేశీయ మార్కెట్లో ఆయా ధరలు నార్మల్‌గానే ఉంటాయి. ఎగుమతులు చేసేవారికి లాభం చేకూరనుంది. హైదరాబాద్ సిటీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.73 గా ఉంది. డీజిల్ రేటు రూ. 103.82 కంటిన్యూ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా దిగొస్తే తప్ప దేశీయంగా ఇంధన ధరలు తగ్గే అవకాశాలు కనిపించవు. నాలుగేళ్ల కిందట అంటే 2022 జులై 1న ఆ తరహా విండ్‌ఫాల్ పన్ను విధానం తీసుకొచ్చింది కేంద్రం. ఆ సమయంలో రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎగబాకాయి. దేశీయంగా ఉన్న ఆయిల్ కంపెనీలు, ముడి చమురు శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ సహా విమాన ఇంధనం, కిరోసిన్ వంటి ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేశాయి.

ALSO READ: దిగొచ్చిన పసిడి ధర.. వినియోగదారుల్లో ఒక్కటే ఆనందం, మార్కెట్లో ధరల మాటేంటి?

భారీగా లాభాలు దక్కించుకుంటున్నాయి. దీన్ని నియంత్రించేందుకు దేశీయంగా చమురు లభ్యత పెంచేందుకు విండ్‌ఫాల్ టాక్స్ తీసుకొచ్చింది కేంద్రం. ముడి చమురు ధరలకు అనుగుణంగా విండ్‌ఫాల్ టాక్స్‌ రేటు మారుస్తూ వచ్చింది. 2024 ఏడాది చివర ముడి చమురు ధరలు భారీగా దిగొచ్చింది. బ్యారెల్‌కు 60 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత తీసుకొచ్చిన టాక్స్ విధానాన్ని ఎత్తేసింది. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. ఏడాది మార్చిలో మరోసారి ఎగుమతులపై పన్ను విధానం తీసుకొచ్చింది. ఆనాటి నుంచి రెండువారాలకు ఒకసారి రేట్లను సవరిస్తూ వస్తోంది కేంద్రం.

Related News

దిగొచ్చిన పసిడి ధర.. వినియోగదారుల్లో ఒక్కటే ఆనందం, మార్కెట్లో ధరల మాటేంటి?

ఓలా, ఊబర్‌కు షాక్.. క్యాబ్ బుకింగ్‌ కోసం టిప్స్ చెల్లించాల్సిన అవసరం లేదు..

రూ.37వేల సాలరీ నుంచి రూ.2.2 కోట్ల ప్యాకేజీ.. టెకీ కెరీర్ స్టోరీ వైరల్

చంద్రశేఖరన్ వారసుడు ఆయనే? టాటా సన్స్ ఉక్కుమనిషి టీవీ నరేంద్రన్

గిగ్ వర్కర్ల భవిష్యత్‌కు భరోసా.. కేవలం రూ.99తో పెన్షన్!

శ్రావణం, పెళ్లిళ్ల సీజన్ మొదలు.. పసిడి ప్రియులకు షాక్, ఇవాళ మార్కెట్లో ధర‌లు చూద్దాం

ఆన్‌లైన్ జిమ్ క్లాస్ బుక్ చేయమంటే వెబ్‌సైట్ హ్యాక్ చేసిన ఏఐ.. ఎలా చేసిందంటే

Big Stories

Advertisement
×