BigTV English

Google Pay Going to Stop: నిజంగా.. గూగుల్ పే షట్ డౌన్ కాబోతుందా..? అయితే, ఆ‌న్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలా మరీ..?

Google Pay Going to Stop: నిజంగా.. గూగుల్ పే షట్ డౌన్ కాబోతుందా..? అయితే, ఆ‌న్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలా మరీ..?

Google is going to Stop the Services of Google Pay in Many Countries from June 4th: మీరు గూగుల్ పే యూజర్లా..? అయితే, మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. గూగుల్ పే తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. జూన్ 4 నుంచి ప్రపంచంలోని అనేక దేశాల్లో గూగుల్ పే సేవలను నిలిపివేయబోతుంది. దీంతో మీరు గూగుల్ పే యాప్ ద్వారా చెల్లింపులు లేదా డబ్బులు స్వీకరించడం లాంటివి చేయలేకపోతారు. ఈ వార్త మీరు వినడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇది వాస్తవమంటూ పలు జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంటున్నారు.


ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వస్తున్నవార్తా కథనాల ప్రకారం వివరాల్లోకి వెళితే.. గూగుల్ సంస్థ తన గూగుల్ పే యాప్ సేవలను భారతదేశంతో సహా అనేక దేశాల్లో ఆన్ లైన్ చెల్లింపుల కోసం ఉపయోగించబడుతుంది. 2022లో Google Walletని ప్రవేశపెట్టిన తరువాత గూగుల్ పే వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతూ వచ్చింది. ఇది ఆన్ లైన్ లావాదేవీల కోసం వినియోగదారుల యొక్క మొదటి ఎంపికగా మారిపోయింది. అయితే.. జూన్ 4, 2024 నుంచి గూగుల్ పేను గూగుల్ సంస్థ షట్ డౌన్ చేయబోతుంది. ఈ వార్త ఆన్లైన్ లావాదేవీలు చేసేటువంటి వినియోగదారులను టెన్షన్ కు గురిచేయొచ్చు. కానీ, గూగుల్ పే మూసివేయబడుతుందనేది మాత్రం వాస్తవం. ఈ విషయాన్ని గూగులే స్వయంగా ధృవీకరించింది. గూగుల్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల పలు దేశాలు ప్రభావితం కాబోతున్నాయి.

కొన్ని దేశాలకు చెందిన గూగుల్ పే వినియోగదారులపై మాత్రం ఎటువంటి ప్రభావం చూపబోదు. అవేమిటంటే.. జూన్ 4 తరువాత కూడా గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్ దేశాల్లో మాత్రమే పనిచేస్తుంది. ఈ దేశాల్లో గూగుల్ పే వినియోగదారులు చెల్లింపులు చేసుకోవొచ్చు. ఎందుకంటే గూగుల్ తన గూగుల్ పే యాప్ సేవలను నిలిపివేయడంలేదు. అయితే, ఇతర దేశాల్లో మాత్రం దీని సేవలు పూర్తిగా నిలిపివేయబడనున్నాయి.


Also Read: అతిపెద్ద కూలింగ్ సిస్టమ్‌తో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్.. రేపే లాంచ్!

కంపెనీ ప్రకారం.. గూగుల్ పే వినియోగదారులందరూ Google Walletకి బదిలీ చేయబడుతారు. జూన్ 4 తరువాత గూగుల్ పే యాప్ అమెరికాలో పూర్తిగా పనికిరానిదిగా మారుతుంది. గూగుల్ పే సేవలను నిలిపివేసిన తరువాత అమెరికన్ వినియోగదారులు చెల్లింపులు చేయలేరు లేదా స్వీకరించలేరు. ఇందులో భాగంగా అమెరికా యూజర్లందరినీ కూడా గూగుల్ వాలెట్ లోకి మారాలని గూగుల్ కోరింది. గూగుల్ వాలెట్ ను ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. దాదాపుగా 180 దేశాల్లో గూగుల్ పే ని Google Wallet భర్తీ చేసిందని కంపెనీ తన బ్లాగ్ లో పేర్కొన్న విషయం తెలిసిందే అంటూ ఆ కథనాల్లో పేర్కొన్నారు.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×