Timed Out In KCL 2025 : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పడం కష్టంతో కూడుకున్నపని. ఎప్పుడూ ఏ ఆటగాడు అద్భుతంగా ఆడుతాడో.. ఏ ఆటగాడు పేలవ ప్రదర్శన కనబరుస్తాడో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో బ్యాట్స్ మెన్ లు రకరకాలుగా ఔట్ అవుతున్నారు. వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాట్స్ మెన్ రకరకాలుగా ఔట్ చేయవచ్చు. వాటిలో బౌల్డ్, క్యాచ్, ఎల్బీడ్ల్యూ, రనౌట్, స్టంప్డ్ ఔట్, హిట్ వికెట్, స్టంప్స్ ను తాకబోయే బంతిని బ్యాట్స్ మెన్ గ్లౌస్ తో అడ్డుకోవడం, ఫీల్డ్ ను అడ్డుకోవడం, టైమ్ ఔట్ కావడం వంటి వాటి వల్ల క్రికెట్ బ్యాట్స్ మెన్స్ ఔట్ అవుతారు. తాజాగా కేసీఎల్ లో ఓ బ్యాట్స్ మెన్ గ్రౌండ్ లో అడుగుపెట్టకుండానే ఔట్ అయ్యాడు. అదేలా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఇలాంటి ఔట్ సాధారణంగా చాలా అరుదైన సందర్భాల్లో చోటు చేసుకుంది. KCL లో కేబీటీ వర్సెస్ సీజీఎస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు 186 పరుగులు చేసింది. అయితే ఆల్ఫీ ఫ్రాన్సిస్ జాన్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్ మెన్ ఔట్ కాగానే నెక్స్ట్ బ్యాట్స్ మన్ క్రీజులోకి రావడానికి చాలా సమయం తీసుకుంటాడు. అలా తీసుకుంటే టైమ్డ్ ఔట్ అవుతారు. సాధారణంగా 90 సెకన్ల లోపు వచ్చి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఏదైనా కారణంతో ఆలస్యంగా వచ్చినా 3 నిమిషాలలోపు సమయం ఉంటుంది. మూడు నిమిషాలు దాటితే.. ఫీల్డింగ్ చేస్తున్న జట్టు అంఫైర్ కి అప్పిల్ చేస్తే బ్యాటింగ్ కి వచ్చే బ్యాట్స్ మెన్ ఔట్ అవుతాడు.
అప్పుడు మ్యాథ్యూస్.. ఇప్పుడు ఆల్ఫీ ఫ్రాన్సిస్
తాజాగా కొచ్చి బ్లూ టైగర్స్ బ్యాట్స్ మెన్ ఆల్ఫీ ఫ్రాన్సిస్ జాన్ సమయానికి బ్యాటింగ్ కి రాక గ్రౌండ్ లోకి అడుగుపెట్టక ముందే ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు గతంలో శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ కూడా ఇలాగే ఔట్ అవ్వడం గమనార్హం. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగినటువంటి మ్యాచ్ లో ఓ వ్యక్తి ఔట్ అయిన తరువాత తరువాత వచ్చె బ్యాట్స్ మెన్ మ్యాథ్యూస్.. ఐసీసీ టైమింగ్ ప్రకారం రావాలి. కానీ మ్యాథ్యూస్ సమయానికి రాకపోవడంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు మ్యాథ్యూస్ పై అప్పిల్ చేశారు. దీంతో అతను టైమ్డ్ ఔట్ అయ్యాడు. తాజాగా కొచ్చి బ్లూ టైగర్స్ బ్యాట్స్ మెన్ ఇలాగే ఔట్ కావడం విశేషం. ఇలాంటి అరుదైన ఘటనలు చాలా తక్కువ సమయంలో చోటు చేసుకుంటాయి. ఈ మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో కొచ్చి బ్లూ టైగర్స్ విజయం సాధించింది.