Bigg Boss 10:వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమం గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో 9 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగా.. పదవ సీజన్ కి కూడా ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 10: దశావతారం అనే ట్యాగ్ లైన్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ బిగ్ బాస్ సీజన్ 10 ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఎవరెవరు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టబోతున్నారు? అగ్ని పరీక్ష ఎప్పుడు ప్రారంభం కానుంది? అగ్ని పరీక్ష ద్వారా నెగ్గిన కామన్ పీపుల్స్ ఎంతమంది హౌస్ లోకి అడుగుపెడుతున్నారు? ఇలా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
2017లో బిగ్ బాస్ సీజన్ 1 తెలుగు ప్రారంభం కాగా.. ఎన్టీఆర్ (NTR ) హోస్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత రెండవ సీజన్ కి నాని (Nani )హోస్ట్ గా చేశారు. కానీ పెద్దగా ఈ షో సక్సెస్ కాలేదు. మూడవ సీజన్ నుండి ప్రముఖ సీనియర్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) హోస్ట్ గా వ్యవహరించారు. తొమ్మిదవ సీజన్ వరకు ఆయనే హోస్ట్ గా చేశారు. అయితే ఈ పదవ సీజన్ కి మరో కొత్త హీరో హోస్ట్ గా చేయనున్నారు అంటూ వార్తలు రాగా.. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నట్లు అధికారికంగా బిగ్ బాస్ 10 వ సీజన్ ను ప్రకటిస్తూ.. ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
also read:బర్తడే రోజు గొప్ప నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ భార్య!
ఇకపోతే ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద ఎత్తున సెట్ పనులు మొదలయ్యాయి. దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇకపోతే సీజన్ 10 కావడంతో ఈసారి కంటెస్టెంట్ల విషయంలో నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీజన్ 10 దశావతారం అంటూ రాబోతున్న నేపథ్యంలో కేవలం పది మందిని మాత్రమే కంటెస్టెంట్ లను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మరోవైపు ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? అనే వార్తలు రాగా.. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రెండు రోజుల క్రితమే నాగార్జునతో హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రోమో షూట్ కూడా జరిగినట్లు సమాచారం. మొత్తానికైతే ఈ సీజన్ కి దశావతారం అనే ట్యాగ్ లైన్ ఇవ్వడంతో ఈసారి కంటెస్టెంట్స్ కూడా 10 మంది ఉంటారనే టాక్ వినిపిస్తోంది. మరి కంటెస్టెంట్లు పదిమందిని తీసుకుంటే.. అగ్నిపరీక్ష ద్వారా ఎంతమంది కామన్ పీపుల్స్ హౌస్ లోకి అడుగు పెడతారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వీటన్నింటికీ తెరపడాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.