Tips for Plot Buying: ప్లాట్ కొనడం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం. దీనిలో భావోద్వేగ , ఆర్థిక అంశాలు రెండూ ఉంటాయి. చాలా మంది తమ కలల ఇంటిని నిర్మించుకోవడానికి ప్లాట్లు కొంటారు. మరికొందరు దానిని పెట్టుబడిగా మాత్రమే చూస్తారు.ఏదేమైనా ప్లాట్ కొనేముందు అవసరమైన పత్రాలను సరిగ్గా చెక్ చేయకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అంతే కాకుండా భవిష్యత్తులో చట్టపరమైన వివాదాలకు , ఆర్థిక నష్టానికి కారణం అవుతుంది.
అందుకే.. ప్లాట్ కొనేప్పుడు అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే చేయడం చాలా ముఖ్యం. ఇది మీ ఆస్తిని చట్టబద్ధంగా సురక్షితంగా ఉంచడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది.
ప్లాట్ కొనేటప్పుడు ఈ 10 డాక్యుమెంట్స్ చెక్ చేయండి:
టైటిల్ డీడ్:
ఈ డాక్యుమెంట్స్ ఆస్తిపై చట్టబద్ధమైన యాజమాన్యం , దానిని తిరిగి అమ్మేహక్కు ఉందని నిర్ధారిస్తుంది. అందుకే ప్లాట్ కొనే ముందు మీకు యజమాని దగ్గర టైటిల్ డీడ్ యొక్క అసలు కాపీని చెక్ చేయండి. డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ప్లాట్ కొనుగోలు చేయండి.
సేల్ డీడ్:
ఇది ఆస్తి యాజమాని నుండి కొనుగోలు దారులకు బదిలీ చేయడానికి అవసరం అయ్యే చట్టపరమైన రుజువు. ఈ పత్రాన్ని స్థానిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి.
ఆస్తిపై ఎటువంటి చట్టపరమైన బకాయిలు, అప్పులు లేదా వివాదాలు లేవని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ధృవీకరిస్తుంది. ఈ సర్టిఫికేట్‌ను సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుండి పొందవచ్చు.
ఖతౌని, ఖస్రా:
ఈ డాక్యుమెంట్స్ భూమి రికార్డులు, యాజమానులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. ఈ రికార్డులలో యజమాని పేరు సంబంధిత సమాచారం ఉంటాయి.
మ్యుటేషన్ రికార్డ్:
సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ రికార్డులలో ఆస్తి కొనుగోలు చేసిన మ్యుటేషన్ రికార్డ్ కు సంబంధించిన వివారలు చెక్ చేసుకోవాలి.
NOC:
ఆస్తిపై ఎటువంటి లోన్స్ లేదా పరిమితులు లేవని నిర్ధారించుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్, నీటి శాఖ, విద్యుత్ శాఖ మొదలైన వివిధ ప్రభుత్వ విభాగాల నుండి NOC పొందడం అవసరం.
మార్పిడి ధృవీకరణ పత్రం:
మీరు వ్యవసాయ భూమిలో ఇల్లు నిర్మించాలనుకుంటే.. భూమి వినియోగాన్ని మార్చడానికి సంబంధిత సర్టిఫికెట్ అవసరం.
పవర్ ఆఫ్ అటార్నీ :
యజమాని స్థానంలో మరొకరు ఆస్తిని అమ్ముతుంటే.. అతడి దగ్గర చట్టబద్ధంగా ధృవీకరించబడిన చెల్లుబాటు అయ్యే పవర్ ఆఫ్ అటార్నీ ఉండాలి.
బిల్డింగ్ ప్లాన్, లేఅవుట్ ఆమోదం:
ప్లాట్‌లో ఇప్పటికే ఏదైనా నిర్మాణం ఉంటే లేదా మీరు నిర్మించాలని ప్లాన్ చేస్తుంటే.. సంబంధిత అధికారి నుండి ఆమోదించబడిన బిల్డింగ్ ప్లాన్ లేఅవుట్ చెక్ చేయండి.
ఆస్తి పన్ను రసీదులు:
బకాయిలు లేవని నిర్ధారించుకోవడానికి గత సంవత్సరాల ఆస్తి పన్ను రసీదులను అడగండి.
Also Read: మే 1 నుండి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే జేబుకు చిల్లు
ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు పైన పేర్కొన్న అన్ని పత్రాలను జాగ్రత్తగా చెక్ చేయడం చాలా ముఖ్యం. ఇది మీ ఆస్తిని చట్టబద్ధంగా సురక్షితంగా ఉంచడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. వీలైతే.. లాయర్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సహాయం తీసుకోండి. తద్వారా మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు.