Janulyri – Dilip: తెలంగాణ ఫోక్ సింగర్ జాను లిరి ఢీ18 విజేతగా నిలిచిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా తన డాన్స్ వీడియోలతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. సడన్ గా నిన్న చనిపోవాలని ఉంది అంటూ వీడియో విడుదల చేసింది. దీంతో అభిమానులు కంగారు పడిపోయి, పలు రకాల కామెంట్లు చేయడంతో ఈరోజు స్పందించిన జాను లిరి మళ్లీ మరో వీడియోతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. తాను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యానని, తన కొడుకుతో కలిసి సంతోషంగా జీవించబోతున్నాను అంటూ తెలిపింది. అంతేకాదు దీనిపై ఎవరికైనా అభ్యంతరం ఉందా అంటూ కూడా ప్రశ్నించింది. ఇక నిన్న సాయంత్రం ఈమె వివాహం చేసుకోబోయే అబ్బాయి ఫోటోని షేర్ చేసింది. కానీ అంతలోనే డిలీట్ చేయడంతో పలు అనుమానాలు రేకెత్తాయి.
డాన్సర్ జానూ తో పెళ్లి పై స్పందించిన సింగర్ దిలీప్.
అయితే ఇప్పుడు తాజాగా జానుతో తాను కూడా పెళ్లికి సిద్ధమే అంటూ సింగర్ ప్రకటించారు. ఈ మేరకు సింగర్ దిలీప్ (Singer Dilip) ఒక వీడియో రిలీజ్ చేశారు. “నేను, జాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాము. మా పెళ్ళికి ఇరు కుటుంబాల సభ్యులు కూడా అంగీకరించారు. మాపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా తట్టుకుంటాము. ఒకరినొకరం ఇష్టపడ్డాము. కాబట్టే ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నాము. ఎవరు ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేసినా సరే మాకు నో ప్రాబ్లం. ఎవరైతే మేము పెళ్లి చేసుకోవాలని బలంగా కోరుతున్నారో వారందరికీ కృతజ్ఞతలు” అంటూ సింగర్ దిలీప్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మొత్తానికి అయితే నిన్న సూసైడ్ చేసుకుంటాను అంటూ వీడియో రిలీజ్ చేసిన జాను.. ఇప్పుడు దిలీప్ వల్లే ఆ నిర్ణయాన్ని మార్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ జంట పెళ్లి పీట లెక్కబోతోంది తెలిసి, ఈ జంటని ఇష్టపడే అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమాధానం ఇవ్వకపోవడం వల్లే ట్రోల్స్..
సాధారణంగా జాను లిరి ఒక సాధారణ మహిళ అయి ఉంటే ఎవరు ఈమె గురించి పట్టించుకునేవారు కాదు. ఈ కాలంలో చాలామంది మొదటి భర్త నుండి విడిపోయిన తర్వాత లేదా మొదటి భర్త దూరమయ్యాక ఇంకొకరిని వివాహం చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారి జీవితాల్లోకి ఎవరు కూడా తొంగి చూడరు. కానీ జాను లిరి ఢీ 18 విజేత. ఆమె ఒక సెలబ్రిటీ.. అందుకే ఆమె వ్యక్తిగత జీవితం గురించి పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జాను లిరి సింగర్ దిలీప్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి వెంటనే డిలీట్ చేయడం వల్లే ఆమెపై పలు రకాల ట్రోల్స్ వచ్చాయి. ఆ ట్రోల్స్ కారణంగానే డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఈమె.. అలా చచ్చిపోతానంటూ వీడియో రిలీజ్ చేసి.. ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యాను అంటూ తెలిపింది.
also read:Janu Lyri: మళ్లీ పెళ్లి.. మరో వీడియో వదిలిన జాను లిరీ, ఈ సారి..!