BigTV English

Lectro H4 & H7+ E-Cycles Mileage @ 40km: చౌక ధరలో ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 40 కి.మీ మైలేజీ!

Lectro H4 & H7+ E-Cycles Mileage @ 40km: చౌక ధరలో ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 40 కి.మీ మైలేజీ!
Hero Lectro H4 & H7+ e-Cycles
Hero Lectro H4 & H7+ e-Cycles

Hero Lectro H4 & H7+ E-Cycles Gives 40km Mileage for 1 Time Charge: ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఎప్పట్నుంచో కొనాలని ప్లాన్ చేస్తున్నారా?. అయితే అధిక ధర కారణంగా వెనక్కి జంకుతున్నారా?. అయితే మీకో శుభవార్త. ఎలక్ట్రిక్ సైకిల్ విభాగంలో ప్రధాన కంపెనీ అయిన హీరో లెక్ట్రో ఇటీవలే భారతీయ మార్కెట్‌లో రెండు కొత్త ఇ-సైకిళ్లను విడుదల చేసింది.


H4, H7+ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లను తీసుకొచ్చింది. ఈ సరికొత్త మోడల్‌లు భారతీయ కస్టమర్ల కనీస అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి అని కంపెనీ తెలిపింది. ఈ సైకిల్స్ స్టైల్, ఫంక్షన్‌ల కలయికను అందిస్తాయి.

కాగా వీటి ధరల విషయానికొస్తే.. H4 ఎలక్ట్రిక్ సైకిల్ ప్రారంభ ధర రూ.32,499 గా కంపెనీ నిర్ణయించింది. ఇది మిస్టిక్ పర్పుల్, డిస్టెన్స్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇక మరొక మోడల్ H7+ ధర కొంచెం ఎక్కువగా నిర్ణయించబడింది. దీని ధర రూ.33,499గా ఉంది. ఇది లావా రెడ్, స్టార్మ్ ఎల్లో, గ్రే కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది.


Also Read: ఈ కారు కొనుగోలుపై ఏకంగా రూ.1.50 లక్షల డిస్కౌంట్.. చివరి తేదీ ఇదే..!

రెండు మోడళ్లు 7.8Ah సామర్థ్యంతో వేరు చేయగలిగిన బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 40 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అయితే దీనికి పూర్తిగా ఛార్జింగ్ పెట్టడానికి కేవలం 4.5 గంటలు మాత్రమే పడుతుంది.

అంతేకాకుండా సేఫ్టీ కోసం అద్భుతమైన ఫీచర్లను అందించబడింది. ఇది వినియోగదారులకు అదనపు భద్రతను అందిస్తుంది. ముఖ్యంగా H4 మోడల్ అనేది చిన్న చిన్న పట్టణాల్లో రయ్ రయ్ మంటూ తిరిగేందుకు ఉపయోగపడుతుంది.

దీనివల్ల ప్రయాణ ఖర్చులపై ఏటా రూ.40,000 వరకు ఆదా అవుతుంది. కాగా ఇది బహుముఖ యునిసెక్స్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. అందువల్ల ఇది అన్ని వయసుల రైడర్‌లకు అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. మరోవైపు H7+ మోడల్ అనేది పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించబడింది.

Also Read: మారుతి కార్లపై భలే ఆఫర్లు.. ఇక జాతరే జాతర!

కొన్ని వాహనాలతో పోలిస్తే ఇది ప్రతి ఏటా సుమారుగా 800 కిలోల CO2 ఉద్గారాలను తగ్గించగలదు. అంతేకాకుండా కాలుష్య రహిత ఎంపికగా కూడా ఇది ఉంటుంది. ఇకపోతే అదనంగా రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు 250W BLDC ఎలక్ట్రిక్ మోటారుతో గరిష్టంగా 25 km/h వేగంతో వచ్చాయి.

అంతేకాకుండా సౌకర్యం, సేఫ్టీ కోసం ఇందులో LED డిస్‌ప్లే, కుషన్డ్ సీట్, చైన్ గార్డ్, డిస్క్ బ్రేక్‌లు, రిఫ్లెక్టర్‌లతో కూడిన యాంటీ-స్కిడ్ పెడల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా H7+ విభిన్న భూభాగాలపై సాఫీగా ప్రయాణించడానికి ఫ్రంట్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇవి స్కిడ్ అవకుండా ఉండేందుకు ఇందులో MTB టైర్లను అందించారు.

Tags

Related News

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Big Stories

×