E-Paper
Advertisement

8గంటలు నీళ్లలోనే.. చెప్పుల్లేకుండా పర్వతోరహణ.. ‘మైసా’ వెనుక రష్మిక కష్టాలు!

8గంటలు నీళ్లలోనే.. చెప్పుల్లేకుండా పర్వతోరహణ.. ‘మైసా’ వెనుక రష్మిక కష్టాలు!
Advertisement

Rashmika Mandanna:చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ వుమన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గర్ల్ ఫ్రెండ్ గా , భార్యగా , రాజకుమారిగా ఇలా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె యాక్షన్ పర్ఫామెన్స్ తో కూడా అదరగొట్టేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. ఇప్పుడు గోండు జాతి గిరిజన అమ్మాయిగా సరికొత్త మాస్ అవతారంలో కనిపించబోతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna)!. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై అనిల్ , అజయ్ సయ్యాపు రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ్ ,హిందీ, మలయాళం , కన్నడ భాషల్లో 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

షూటింగ్ కి వెళ్లాలంటే వణుకు పుట్టేది..

మైసా విడుదల తేదీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ సినిమాపై అంచనాలు పెంచుతూ వరుస అప్డేట్స్ వదులుతున్నారు మేకర్స్. అందులో భాగంగానే సెప్టెంబర్ 20వ తేదీన ఘనంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈవెంట్లో పాల్గొన్న రష్మిక సినిమా వెనుక తన కష్టాన్ని వివరిస్తూ.. ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. మైసా సినిమా కోసం నేను నా జీవితాన్ని ఇచ్చేశాను. నా కెరియర్ లోనే అత్యంత కష్టమైన సినిమా ఇది. ప్రతి కొత్త చిత్రంలో కూడా ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉండాలని నేను కోరుకుంటాను. కానీ రవీంద్ర పుల్లే మాత్రం నన్ను నానా కష్టాలు పెట్టారు . సెట్స్ కి వెళ్లాలంటేనే నాకు వణుకు పుట్టేది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రష్మిక.

Advertisement

ALSO READ:ఆధార్ కార్డ్ చూపించి మరీ రియల్ ఏజ్ చెప్పేసిన వైష్ణవి చైతన్య!

రోజుకి 8 గంటలు నీటి అడుగున యాక్షన్ సీన్స్..

ముఖ్యంగా మైసా సినిమా షూటింగ్ నాకు ప్రతిరోజు సవాలే.. సెట్స్ కి వెళ్లడానికి భయం వేసేది. కొండ శిఖరాల నుండి దూకడం, పర్వత ప్రాంతాల్లో చెప్పులు లేకుండా నడవడమే కాకుండా రోజుకు సుమారుగా 8 గంటల పాటు నీటి అడుగున ఉండి ఫైట్ సీన్స్ చేశాను. నాకు ఈత వచ్చు కదా అని అండర్ వాటర్ ఫైట్ చాలా తేలిక అనుకున్నాను. కానీ రోజుకు ఎనిమిది గంటలు నీళ్లలోనే ఉండమంటే నేనేమైనా చేపనా అనిపించింది.

మా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నాం..

Advertisement

అడవులు, జలపాతాలు , అండర్ వాటర్ యాక్షన్, రిస్కీ స్టంట్ లు అన్నీ కూడా రియల్ గానే చేసాము . మా కష్టానికి ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారనే నమ్మకం నాలో ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రేక్షకుడిని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. నా కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది ” అంటూ మైసా సినిమా కోసం రష్మిక పడ్డ కష్టాన్ని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికైతే ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టాన్ని ఆమె మాటల్లో వింటుంటే అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాకి ఆమె రియల్ హీరో మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

ఆధార్ కార్డ్ చూపించి మరీ రియల్ ఏజ్ చెప్పేసిన వైష్ణవి చైతన్య!

“నేను బ్రతికే ఉన్నాను”.. సోషల్ మీడియా ట్రోల్స్ పై నటి వడివుక్కరశి ఆవేదన!

విడాకుల పై కాజల్ షాకింగ్ కామెంట్స్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

బాలయ్య ‘దాదా’ నుంచి బిగ్ అప్డేట్.. థమన్ చెప్పింది ఇదే!

జైలర్ 2లో స్టార్‌ల జాతర.. రజనీకి తోడుగా ఇంతమందా?

మిర్జాపూర్‌కు సీక్వెల్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే..

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

Big Stories

Advertisement
×