BigTV English

Honda Cars: ఆ కంపెనీ కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఇది కదా ఆఫర్ అంటే..?

Honda Cars: ఆ కంపెనీ కార్లపై భారీ డిస్కౌంట్స్.. ఇది కదా ఆఫర్ అంటే..?
Honda Cars discounts
Honda Cars discounts

Honda Cars discounts: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హూండా కార్స్ ఇండియా వాహన ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 2024లో తమ వాహనాలపై పలు నగదు, ఇతర బెనిఫిట్స్‌ను ప్రకటించింది. అందులో హూండా అమేజ్‌పై అత్యధిక బెనిఫిట్స్ లభిస్తుంది. ఆ తర్వాత సిటీ, ఎలివేట్ వంటి మోడల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మోడల్స్ ఎంత వరకు బెనిఫిట్స్ పొందగలుగుతాయో తెలుసుకుందాం.


హూండా ఎలివేట్‌పై కంపెనీ ‘సెలబ్రేషన్ ఆఫర్’ అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రకారం.. ఈ మోడల్‌పై రూ.19000 వరకు బెనిఫిట్స్ పొందొచ్చు. కాగా ఇది హూండా పోర్ట్ ఫోలియోలో ఉన్న ఒకే ఒక్క ఎస్యూవీ ఎలివేట్ ఇది. దీని ధర రూ.11.69 లక్షల నుంచి రూ.16.51 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది.

దీంతోపాటు హూండా సిటీపై కూడా అద్భుతమైన ఆఫర్ ఉంది. దీనిపై రూ.10000 వరకు నగదు డిస్కౌంట్ లేదా రూ.10,897 వరకు యాక్సెసరీలను పొందొచ్చు. దీని జెడ్‌ఎక్స్ వేరియంట్‌పై రూ.15000 వరకు క్యాష్ తగ్గింపు లేదా రూ.16,296 వరకు యాక్సెసరీస్‌ బెనిఫిట్స్ లభిస్తాయి.


Also Read: ఫోక్స్ వ్యాగాన్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. రూ. లక్షల్లో డిస్కౌంట్లు..!

ఈ ఆఫరే కాకుండా మరో ఆఫర్ కూడా ఉంది. రూ.15,000 వరకు కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. ఇవికాకుండా హోండా కారు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ .10వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ .5వేలు, కస్టమర్ లాయల్టీ బోనస్ రూ.4వేలు, హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ రూ .6వేలు పొందొచ్చు. రూ.36,500 ప్రయోజనాలతో ఎలిగెంట్ ఎడిషన్ అనే ప్రత్యేక ఎడిషన్‌ను విక్రయిస్తోంది.

చివరిగా హూండా అమేజ్‌పై మంచి ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. దీనిపై రూ.10000 వరకు నగదు డిస్కౌంట్ పొందొచ్చు. లేదా రూ.12,349 వరకు యాక్సెసరీలను అయినా పొందొచ్చు. ఈ వేరియంట్‌పై రూ.5000 వరకు క్యాష్ తగ్గింపు లేదా రూ.6,298 వరకు యాక్సెసరీస్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

ఇవి కాకుండా మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి. రూ.20వేల వరకు ప్రత్యేక కార్పొరేట్ తగ్గింపు ఉంది. అంతేకాకుండా రూ.3వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.4వేల కస్టమర్ లాయల్టీ బోనస్, రూ.10 వేల కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.6వేల హూండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ వంటివి లభిస్తాయి. అయితే అమేజ్ ఎలైట్ ఎడిషన్ అనే ప్రత్యేక ఎడిషన్‌ను రూ.30వేల వరకు బెనిఫిట్స్‌తో విక్రయిస్తోంది.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×