BigTV English

AP Election Results 2024 : ఉత్తరాంధ్రలో కూటమి హవా, 30 సీట్లలో జోరు, పత్తాలేని మంత్రులు..

AP Election Results 2024 : ఉత్తరాంధ్రలో కూటమి హవా, 30 సీట్లలో జోరు, పత్తాలేని మంత్రులు..

AP Election Results 2024 North Andhra 30 seats lead by TDP Kutami: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి ఉత్తరాంధ్ర ఓటర్లు షాకిచ్చారు. ఎక్కడ చూసినా పసుపు జెండా రెపరెపలాడుతోంది. విశాఖను శాసన రాజధానిగా చేస్తానని సీఎం జగన్ పదేపదే చెప్పినప్పటికీ ఓటర్లు ఏ మాత్రం పట్టించుకోలేదు.


ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో సైకిల్ జోరు కొనసాగుతోంది. తొలి నాలుగు రౌండ్లు పూర్తి అయ్యేసరికి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై దాదాపు ఐదు వేల పైచిలుకు మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారు. యువత, మహిళలు, ఉద్యోగులు ఇలా అన్నివర్గాల ప్రజలు టీడీపీని ఆదరించారు. దాని ఫలితం అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్ వంటి నేతలు పరాజయం అంచున ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రమే కాస్త లీడ్‌లో కొనసాగు తున్నారు. మరికొందరు నేతలు కౌంటింగ్ కేంద్రాలను విడిచినట్టు తెలుస్తోంది. చాలామంది ఓటర్లు మాత్రం గతంలో జగన్ ఒక్కఛాన్స్ అడిగితే ఇచ్చామని, మరో ఛాన్స్ కావాలని అడగలేదని అంటున్నారు. ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లకు గాను 30 సీట్లు టీడీపీ కూటమి జోరు కొనసాగుతోంది. ఇక్కడ కూటమి మధ్య ఓట్లు బాగానే బదిలీ అయ్యాయని అంటున్నారు.


ALSO READ: ఏపీలో సైకిల్ జోరు, ఓటమి బాటలో మంత్రులు, గాలి తగ్గిన ఫ్యాన్

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి యువత షాకిచ్చారు. అయినా వారి తీరు మారలేదని అంటున్నారు. దాని ఫలితమే ఫ్యాన్ గాలి తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.

Tags

Related News

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

Big Stories

×