Investment tips: డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరి కల. కానీ, ఆ డబ్బును సరిగ్గా సరైన సమయానికి, సరైన ప్రాంతంలో పెట్టుబడి చేసినవారే నిజంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో అనేక మంది బిజినెస్ ప్రొఫెషనల్స్, ఇన్వెస్టర్స్ తమ డబ్బును వ్యూహాత్మకంగా పెట్టుబడి చేసి కోటీశ్వరులు అయ్యారు. అలా అని కోటీశ్వరులు కావాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మీరు కేవలం ప్రతి రోజు 100 రూపాయల మొత్తం సేవ్ చేస్తే చాలు. మీరు కోటీశ్వరులు అయ్యే ఛాన్సుంది. అవును మీరు విన్నది నిజమే. 100 రూపాయలు సేవ్ చేయడం ద్వారా మీరు దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు కోటీశ్వరులు అయ్యేందుకు దీర్ఘకాలిక వ్యూహం బాగా పనిచేస్తుంది. ఈ క్రమంలో మీరు రోజుకు కేవలం 100 రూపాయలు ఆదా చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాలు పొందవచ్చు. అయితే మీ పెట్టుబడిని నిరంతరం పెంచే సాధనాలైన మ్యూచువల్ ఫండ్ SIPలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు మంచి రాబడులు వస్తాయి. మ్యూచువల్ ఫండ్ SIP (Systematic Investment Plan) వంటి వ్యూహాల ద్వారా నిరంతరం చిన్న మొత్తాలను పెట్టుబడి చేయడం ద్వారా, మార్కెట్ పెరుగుదల వల్ల మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: Investment Plan: SBIలో అదిరిపోయే గ్రోత్ ప్లాన్.. పెట్టిన మొత్తంపై మూడు రెట్ల లాభం
ఈ క్రమంలో మీరు రోజుకు రూ. 100 ఆదా చేసి, నెలవారీ SIPలో రూ. 3 వేలు పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 27 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఆ క్రమంలో మీరు చేసే మొత్తం పెట్టుబడి రూ. 9,72,000 కాగా, మీకు లభించేది మాత్రం రూ. 1,10,20,209 అవుతుంది. అంటే మీకు వడ్డీ రూపంలోనే రూ. 1,00,48,209 లభిస్తాయి. సాధారణంగా సిప్ విధానంలో వార్షిక రాబడులు 12 శాతం నుంచి 19 శాతం వరకు లభిస్తాయి. ఇక్కడ వార్షిక రాబడి 15 శాతం చొప్పున లెక్కించడం జరిగింది.
గమనిక: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేయాలని బిగ్ టీవీ సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. ఈ పెట్టుబడులపై మీకు ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తప్పక తీసుకోవాలి.