BigTV English

KL Rahul: ఏం గుండె రా అది… ఐపీఎల్ 2025 కంటే ముందు కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం ?

KL Rahul: ఏం గుండె రా అది… ఐపీఎల్ 2025 కంటే ముందు కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం ?

KL Rahul: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ పూర్తయింది. దీంతో ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} పై పడింది. ఈ 18వ సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొత్తం పది జట్లు ఈ మెగా లీగ్ లో హోరాహోరీగా పోటీ పడతాయి. ఇప్పటికే ఈ పది జట్లలో 9 జట్లు కెప్టెన్లపై క్లారిటీ ఇచ్చేశాయి. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ మాత్రం తమ కెప్టెన్ ఎవరనే విషయాన్ని అధికారికంగా తెలపలేదు.


 

పైగా ఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ కి గత సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన రిషబ్ పంత్ ని విడిచిపెట్టింది. దీంతో కొత్త కెప్టెన్ ని ఎంపిక చేయడం అనివార్యమైంది. అయితే ఢిల్లీ కెప్టెన్ గా భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ అయిన కేఎల్ రాహుల్ లేదా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ లలో ఒకరిని ఎంపిక చేస్తారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెంట్స్ జట్టుకి నాయకత్వం వహించాడు. కానీ రాహుల్ ని 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లకు కొనుగోలు చేసింది.


రాహుల్ కి ఐపీఎల్ లో ఎంతో అనుభవం ఉంది. 2013లో ఆర్సిబి జట్టుతో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు రాహుల్. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. అయితే రాహుల్ కి చాలా అనుభవం ఉండడంతో అతడినే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కెప్టెన్ గా నియమిస్తారని భావించారు.

కానీ కె.ఎల్ రాహుల్ కెప్టెన్సీ పై సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన పూర్తి ఫోకస్ ని బ్యాటింగ్ పై పెట్టేందుకు కెప్టెన్సీ బాధ్యతలను తనకు అప్పగించవద్దని జట్టు మేనేజ్మెంట్ కి తెలియజేశాడట కేఎల్ రాహుల్. దీంతో ఢిల్లీ జట్టుకి అక్షర్ పటేల్ ని కెప్టెన్ గా నియమించడం లాంఛనంగా మారింది. ఇన్ని రోజులుగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లలో ఢిల్లీ జట్టుకు ఎవరూ కెప్టెన్ అవుతారు అనే ప్రశ్నలకు తాజా నిర్ణయంతో జవాబు దొరికినట్లయింది.

త్వరలోనే మేనేజ్మెంట్ కెప్టెన్ ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన తొలి రెండు మ్యాచ్ ల కోసం విశాఖపట్నం వెళ్లే ముందు.. ఢిల్లీలోనే ప్రాక్టీస్ శిబిరాన్ని నిర్వహిస్తుంది. అయితే మరోవైపు కె.ఎల్ రాహుల్ భార్య అథియా శెట్టి త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభ సమయంలో కేఎల్ రాహుల్ కుటుంబానికి సమయాన్ని కేటాయించాలని భావిస్తున్నారట.

 

ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో మొదటి రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కె.ఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో జట్టు రెండుసార్లు ప్లే ఆఫ్ కి చేరుకుంది. రాహుల్ 134 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 4683 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. మరోవైపు అక్షర్ పటేల్ ఇప్పటివరకు 150 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. దాదాపు 131 స్ట్రైక్ రేట్ తో 1653 పరుగులు చేశాడు. అలాగే 7.28 ఎకానమీ రేట్ తో 123 వికెట్లు పడగొట్టాడు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×