OTT Movie : ఓటిటిలో రొమాంటిక్ సినిమాలకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది మూవీ లవర్స్ ఇలాంటి సినిమాలను ఒంటరిగా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూడలేని సినిమాల కోసం చాలామంది వెతుకుతారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇది కంప్లీట్ గా యూత్ ఫుల్ మూవీ. కాబట్టి సింగిల్ గా చూస్తే బెటర్ అనే విషయాన్ని ముందుగా గుర్తు పెట్టుకోండి. మరి ఈ రొమాంటిక్ జానర్ లో రూపొందిన మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ రొమాంటిక్ సినిమా పేరు ‘బ్యూటిఫుల్ డిజాస్టర్’ (Beautiful Disaster). ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీలో కేవలం రొమాన్స్ మాత్రమే కాదు, కామెడీ డ్రామా కూడా కావలసినంత ఉంటుంది. ఓ అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే వింత ఛాలెంజ్, ఆ తర్వాత అమ్మాయి ఎదుర్కొనే పరిస్థితులు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ రొమాంటిక్ మూవీ ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళ్తే…
హై స్కూల్ కంప్లీట్ చేసిన అబ్బి అనే అమ్మాయి కాలేజీకి వెళ్తుంది. అక్కడ తన క్లోజ్ ఫ్రెండ్ తో కలిసి రూమ్ షేర్ చేసుకుంటుంది.. అయితే హీరోయిన్ ఫ్రెండ్ తనని ఫస్ట్ డే ఒక ఫైటింగ్ క్లబ్ కి తీసుకెళ్తుంది. అక్కడ హీరో నైట్ క్లబ్ లో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో వీరిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం, మనుషులు కలవడం వెంటవెంటనే జరిగిపోతాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఆ హీరో హీరోయిన్ చదివే కాలేజీలోనే అతను కూడా చదువుతూ ఉంటాడు. పైగా అతను ఒక ప్లే బాయ్. హీరోయిన్ మాత్రం తన గతం నుంచి తనను తాను దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, హీరో పట్ల తాను ఆకర్షితురాలు అవుతున్న విషయాన్ని దాస్తుంది. కానీ ఓ రోజు హీరో, హీరోయిన్ కి వింత చాలెంజ్ ఇస్తాడు. ఒకవేళ తాను ముట్టుకోకుండానే నైట్ ఫైట్ క్లబ్లో అవతలి వ్యక్తిని ఓడిస్తే, 30 రోజులు తనతోనే ఉండాలని, తన బెడ్ పైనే పడుకోవాలని అడుగుతాడు. హీరోయిన్ దానికి ఒప్పుకుంటుంది. మరి ఆ తర్వాత హీరో ఛాలెంజ్ చేసినట్టుగా ఆ ఫైట్ లో గెలిచాడా? హీరోయిన్ ఛాలెంజ్ ప్రకారం అతనితో 30 రోజులపాటు ఉండిపోయిందా? ఆ 30 రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయి? 30 రాత్రులు ఇద్దరు ఏం చేశారు? వంటి విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ఫ్యామిలీ, చిన్న పిల్లలతో మాత్రం కలిసి ఈ మూవీని చూడొద్దని గుర్తుపెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం రొమాంటిక్ జానర్ లో సింగిల్ గా సినిమాలను చూడాలనుకునే మూవీ లవర్స్ ఈ వీకెండ్ ‘బ్యూటిఫుల్ డిజాస్టర్’ (Beautiful Disaster) తో పండగ చేసుకోండి.