BigTV English

NPS Pension Plan: పెళ్లైన తర్వాత మీ భార్య పేరుతో ఇలా చేయండి..నెలకు రూ.75 వేలకుపైగా పెన్షన్

NPS Pension Plan: పెళ్లైన తర్వాత మీ భార్య పేరుతో ఇలా చేయండి..నెలకు రూ.75 వేలకుపైగా పెన్షన్

NPS Pension Plan: అనేక మంది ఉద్యోగస్తులు, స్వయం ఉపాధి చేసుకునే వ్యక్తులు ఇప్పటి నుంచే భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు. ప్రధానంగా రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఎంతో కొంత సేవ్ చేస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. అలాంటి వారికి NPS (నేషనల్ పెన్షన్ స్కీం) అనేది మంచి ఎంపికగా ఉంటుంది. ఇది ప్రభుత్వ ఆమోదిత రిటైర్మెంట్ ప్లాన్. దీని ద్వారా భవిష్యత్తులో ఒక స్థిరమైన పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.


ఎంత  పెట్టుబడి
ఉదాహరణకు మీ భార్య పేరుతో ప్రతి నెల చిన్న మొత్తాలను సేవ్ చేస్తే ఫ్యూచర్లో నెలకు 75 వేల రూపాయలకుపైగా పెన్షన్ పొందవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. NPS (నేషనల్ పెన్షన్ స్కీం) అనేది ప్రభుత్వ ఆమోదిత రిటైర్మెంట్ ప్లాన్, దీని ద్వారా మీరు భవిష్యత్తులో భద్రతగా పెన్షన్ పొందవచ్చు. అంటే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.75,000 పెన్షన్ రావాలంటే ఎంత మొత్తాన్ని కట్టాలి? ఏ వయస్సులో ప్రారంభించాలి? ఎంతకాలం పెట్టుబడి పెట్టాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ తెలుసుకుందాం!

NPS అంటే ఏమిటి?
NPS అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రిటైర్మెంట్ స్కీమ్, దీని ద్వారా ఉద్యోగులు, స్వయం ఉపాధి చేసేవారు భవిష్యత్‌లో ఒక స్థిరమైన ఆదాయం పొందేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో డబ్బును మ్యూచువల్ ఫండ్‌ల ద్వారా పెట్టుబడి పెడతారు. ఇది పొదుపు అలవాటు పెంచటమే కాకుండా, పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.


60 ఏళ్ల వరకు
60 ఏళ్ల తర్వాత రూ. 80,000 పెన్షన్ రావాలంటే మీరు NPS‌లో క్రమంగా నెలకు రూ. 5 వేలు పెట్టుబడి చేయాలి. 25 ఏళ్ల వయస్సులో దీనిని ప్రారంభిస్తే 60 ఏళ్ల వయస్సు వరకు 35 సంవత్సరాలు పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మీరు 60 ఏళ్ల వరకు చేసిన పెట్టుబడి రూ. 21,00,000 అవుతుంది. కానీ మీకు వచ్చేది మాత్రం రూ.1,47,08,922. అంటే ఇక్కడ మీకు వడ్డీ రూపంలోనే కోటీ 26 లక్షల రూపాయలు లభిస్తాయి.

Read Also: Wireless Earbuds Offer: OnePlus వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ పై …

వడ్డీ రూపంలో
60 ఏళ్లకు చేరుకున్న తర్వాత, మొత్తం 60% డబ్బు లంప్‌సమ్‌గా (ఒక్కసారిగా) తీసుకోవచ్చు. మిగిలిన 40% డబ్బు అన్యుటీ ప్లాన్‌లోకి వెళ్ళి, నెలవారీ పెన్షన్‌గా వస్తుంది. అన్యుటీ రూపంలో మీకు నెలకు 35 వేలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే సమయంలో విత్ డ్రా చేసుకున్న 60 శాతం మొత్తాన్ని బ్యాంకులో FD చేసుకుని నెలవారీగా మరో 40 వేల మొత్తాన్ని వడ్డీ రూపంలో పొందవచ్చు. అంటే నెలకు మొత్తం 75 వేలకుపైగా పొందే అవకాశం ఉంది.

NPS ఖాతా ఎలా ప్రారంభించాలి?
-NPS ఖాతా ప్రారంభించడం చాలా సులభం. మీరు ఆన్‌లైన్ లేదా బ్యాంక్/పోస్టాఫీస్ ద్వారా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా: NPS అధికారిక వెబ్‌సైట్ (https://enps.nsdl.com/) లో లాగిన్ అవ్వండి. ఆధార్ లేదా PAN కార్డు ద్వారా వివరాలను నమోదు చేయండి. నెలకు లేదా సంవత్సరానికి పెట్టుబడి చేసేందుకు ఆప్షన్ ఎంచుకోండి.

ఆఫ్‌లైన్ ద్వారా:
దగ్గరలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో NPS ఖాతా ఓపెన్ చేయండి. KYC డాక్యుమెంట్స్ సమర్పించండి. ప్రారంభించడానికి కనీసం రూ. 500 చెల్లించాలి.

NPS స్కీమ్‌లో పెట్టుబడి ప్రయోజనాలు
పన్ను మినహాయింపు – NPS‌లో పెట్టుబడి ద్వారా Sec 80C & 80CCD(1B) ప్రకారం రూ.2 లక్షల వరకు ట్యాక్స్ సేవింగ్ లభిస్తుంది.
కంపౌండింగ్ ప్రయోజనం – పెట్టుబడి కాలం ఎక్కువగా ఉంటే, అధిక రాబడి పొందే అవకాశం ఉంటుంది.
భద్రత & నాణ్యత – ప్రభుత్వ నియంత్రణలో ఉండడం వల్ల పెట్టుబడి సురక్షితం.

NPS నుంచి డబ్బు ఎలా విత్‌డ్రా చేసుకోవాలి?
-60 ఏళ్లకు చేరుకున్న తర్వాత, మొత్తం 60% డబ్బు లంప్‌సమ్‌గా (ఒక్కసారిగా) తీసుకోవచ్చు.
-మిగిలిన 40% డబ్బు అటాన్యుటీ ప్లాన్‌లోకి వెళ్ళి, నెలవారీ పెన్షన్‌గా వస్తుంది.
-60 ఏళ్లకు ముందే NPS విత్‌డ్రా చేయాలంటే, కచ్చితమైన కారణం చూపాలి.

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×