Health Insurance Claim: ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మారింది. ఉద్యోగులకు కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నా.. కొంతమంది సొంతంగా మరో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు. కంపెనీలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ కు కొన్ని లిమిట్స్ ఉంటాయి. కొన్ని చికిత్సలు కవర్ అవ్వవు. ఉద్యోగం మారితే.. పాలసీని కోల్పోతాము. అందుకే చాలా మంది వ్యక్తిగత పాలసీ తీసుకుంటున్నారు. అయితే ఒకే చికిత్సకు రెండు హెల్త్ పాలసీల నుండి క్లెయిమ్ చేసుకోవచ్చా?.. అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.
ఒక వ్యక్తి ఒకే ఆసుపత్రిలో చేరినప్పుడు కార్పొరేట్, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండింటి కింద క్లెయిమ్ చేసుకోవచ్చని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. ఆసుపత్రి బిల్లు బీమా మొత్తం కంటే ఎక్కువగా ఉంటే, మిగిలిన మొత్తాన్ని మరో పాలసీ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పాలసీదారునికి ఒకటి కంటే ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే.. రెండు బీమా సంస్థలకు ఈ విషయాన్ని తెలియజేయాలి. భవిష్యత్తులో ఆరోగ్య బీమా క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఇది చాలా ముఖ్యం. రెండు పాలసీల విషయం బీమా కంపెనీలకు చెప్పకపోవడం.. క్లెయిమ్‌లు రిజెక్ట్ అవ్వడానికి బెసిక్ రీజన్ అని ఎక్స్ ఫర్ట్స్ చెబుతున్నారు.
క్లెయిమ్ చేసే సమయంలో రెండో పాలసీ గురించి మొదటి బీమా సంస్థకు చెబితే సెటిల్‌మెంట్‌పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. రెండు పాలసీలలో క్లెయిమ్ పెట్టినప్పటికీ.. మొత్తం రీయింబర్స్‌మెంట్ హాస్పిటల్ బిల్లు కంటే ఎక్కువగా ఉండకూదదు. అలాగే ఒకే వైద్య ఖర్చును వేర్వేరు పాలసీల కింద రెండుసార్లు క్లెయిమ్ చేయలేరని నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు: ఒక వ్యక్తికి ఆసుపత్రి బిల్లు రూ. 8 లక్షలు అయింది. అతడికి కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద రూ.5 లక్షలు, పర్సనల్ పాలసీ కింద మరో రూ. 5 లక్షల కవరేజీ ఉంది. ముందుగా కార్పొరేట్ పాలసీని ఉపయోగించి రూ.5 లక్షలను క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ లేదా రీయింబర్స్‌మెంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన రూ. 3 లక్షలను పర్సనల్ పాలసీతో క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండో క్లెయిమ్ చేసినప్పుడు పాలసీదారుడు మొత్తం బిల్స్ బీమా సంస్థకు సబ్మిట్ చేయాలి. అలాగే మొదటి బీమా సంస్థ చేసిన సెటిల్‌మెంట్ సమ్మరీ కూడా సమర్పించాలి.
Also Read:హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు చెక్ చేయండి
రెండు పాలసీలున్న వారు ఫస్ట్ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ను వినియోగించుకోవాలని ఎక్స్ ఫర్ట్స్ చెబుతున్నారు. కవరేజీ సరిపోకపోతే అప్పుడు పర్సనల్ పాలసీని వాడుకోవాలని సూచిస్తున్నారు. పర్సనల్ పాలసీల్లో క్లెయిమ్స్ లేకపోతే.. రెన్యువల్ టైమ్ లో నో క్లెయిమ్ బోనస్‌లు లేదా ప్రీమియం తగ్గింపు ప్రయోజనాలను ఉంటాయి. అందువల్ల, ముందుగా కార్పొరేట్ పాలసీని, ఆ తర్వాత వ్యక్తిగత పాలసీని ఉపయోగించుకోవడం బెస్ట్ ఆప్షన్.
కొన్ని కారణాలతో రెండో క్లెయిమ్ ను ఇన్సూరెన్స్ కంపెనీలు రిజెక్ట్ చేస్తుంటాయి. ఫస్ట్ పాలసీ క్లెయిమ్ గురించి రెండో బీమా సంస్థకు తెలియజేయకపోవడం, రెండు బీమా కంపెనీల నుంచి ఒకే బిల్లును రెండుసార్లు క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించడం, ఆసుపత్రిలో చేరిన వెంటనే బీమా సంస్థలకు తెలియజేయకపోవడం, తగినన్ని పత్రాలు లేకపోవడం, మొదటి బీమా సంస్థ నుంచి సెటిల్‌మెంట్ సర్టిఫికేట్ లేకపోవడం..ఇలాంటి కారణాలతో క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంటాయి. కార్పొరేట్ బీమా పాలసీ కవరేజీకి, సొంత పాలసీ అదనపు ఖర్చుల నుంచి రక్షణను అందించడానికి సహాయపడుతుంది.