Earn One Crore: ఒకప్పుడు కోటి రూపాయలు సంపాదించాలంటే ఏదైనా పెద్ద వ్యాపారం చేసి, లేదా భారీ పొదుపు అవసరం అనుకునేవారు. కానీ, క్రమశిక్షణతో పొదుపు చేసేవారికి ఇది పెద్ద కష్టమైనది కాదని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) నిరూపిస్తుంది. SIP ద్వారా నెల నెలా పెట్టుబడి పెడుతూ, సరైన ప్లానింగ్‌తో మీరు కేవలం 10 ఏళ్లలోనే కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇప్పటి నుంచే మీరు దీనిని ప్రారంభిస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందుతారు. ఇదేమి అసాధ్యమైన విషయం కాదు. అయితే, అందుకు ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలి? ఏ రేటు రాబడి ఆశించాలి? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇవన్నీ వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మరింత సులభం
భారతదేశంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా సంపదను పెంచుకోవడం ఇప్పుడు మరింత సులభమవుతోంది. ముఖ్యంగా, 10 సంవత్సరాల్లో రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే, కొన్ని కీలక అంశాలను ముందుగా గమనించాలి.
మీ లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు
దీని కోసం Step up SIP Strategy పాటించాల్సి ఉంటుంది. అంటే మీ ఆదాయం పెరిగే కొద్దీ SIP మొత్తాన్ని ఏటా 5% లేదా 10% పెంచితే, మీరు తక్కువ మొత్తంతోనే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఉదాహరణకు, మీరు రూ. 30 వేలతో SIP ప్రారంభించి ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ పోతే, కోటి రూపాయల లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారు.
ఫండ్ ఎంపిక కీలకం
సరైన ఫండ్ ఎంపిక చాలా కీలకం. SIP పెట్టుబడి ఎక్కడ చేయాలి అన్నది మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. గతంలో స్థిరమైన 12-19% CAGR ఇచ్చిన కొన్ని ఉత్తమ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవాలి. వాటిని ఎంచుకోవడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలోనూ మీకు మంచి రాబడులు వస్తాయి.
Read Also: QLED TV Launch Offer: రూ.6 వేలకే బ్రాండెడ్ QLED స్మార్ట్ ..
ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే..
ఈ క్రమంలో మీరు కోటి రూపాయల రాబడి కోసం SIP ద్వారా 10 సంవత్సరాలు, అంటే 120 నెలలపాటు నెలకూ రూ. 35 వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మీరు ప్రతి ఏడాది 5 నుంచి 10 శాతం మీ ఆదాయాన్ని బట్టి ఇన్వెస్ చేసే మొత్తాన్ని పెంచుకుంటే మీరు కోటి రూపాయల మొత్తాన్ని ఈజీగా చేరుకోవచ్చు. ఈ క్రమంలో మీరు చేసిన పెట్టుబడి రూ. 46,80,000 కాగా, మీకు లభించే మొత్తం రూ.1,02,57,709 అవుతుంది. ఈ క్రమంలో సగటు వార్షిక రాబడి 15 శాతం ప్రకారం, మీకు పదేళ్ల సమయంలోనే రూ. 55,77,709 లక్షలు పొందుతారు.
మనం ఏమి చేయాలి?
మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోకండి: ఈక్విటీ మార్కెట్లు కదలికలు సాధారణమే. SIPలో దీర్ఘకాలిక దృక్పథంతో ఉండండి.
SIP కొనసాగించడం అత్యవసరం: మార్కెట్ కిందికి వచ్చినప్పుడు కూడా SIP ఆపకూడదు. ఈ ఫేజ్‌లో పెట్టుబడి పెడితే, లాంగ్-టర్మ్‌లో అత్యధిక రాబడిని పొందగలుగుతారు.
పోర్ట్‌ఫోలియోను ప్రతి 6-12 నెలలకు సమీక్షించండి: మీరు పెట్టుబడి చేసిన ఫండ్స్ మంచి ప్రదర్శన చూపుతున్నాయా లేదా అన్నది సమీక్షించాలి.
Goal-Based Investing: 10 సంవత్సరాల తర్వాత లక్ష్యం పూర్తి కావాలంటే, పూర్తిగా ఈక్విటీ ఫండ్స్‌లోనే కాకుండా, చివరి 2-3 సంవత్సరాలలో నిడివి తక్కువ ఫండ్స్‌లోకి (Debt Funds) మారండి.
ఎలా ప్రారంభించాలి?
-SIP ఖచ్చితంగా మొదలు పెట్టండి: మీరు ఇంకా ప్రారంభించకపోతే, ఇప్పుడే ప్రారంభించండి.
-సరైన ఫండ్స్ ఎంచుకోండి: మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, మీకు తగ్గ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోండి.
-Discipline Follow చేయండి: ప్రతి నెలా ఒకే తేదీకి SIP కట్టాలి.
-Step-Up SIP Strategy Follow చేయండి: 5-10% SIP ప్రతి ఏడాది పెంచుకోండి.
-ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి: మీకు అనువైన పెట్టుబడి ప్రణాళిక కోసం ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించండి.