BigTV English

HCU Biodiversity Controversy : డ్రామారావు కొత్త డ్రామాలు.! ఏది నిజం.? ఏది అబద్ధం.?

HCU Biodiversity Controversy : డ్రామారావు కొత్త డ్రామాలు.! ఏది నిజం.? ఏది అబద్ధం.?

HCU Biodiversity Controversy Full Details: కంచ గచ్చిబౌలి. ఇప్పుడు తెలంగాణలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. పాపులర్ కూడా అయింది. ఎందుకంటే ఇక్కడి 400 ఎకరాలను డెవలప్ చేసి ఐటీ సహా ఇతర కంపెనీలకు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూముల్ని లీజుకు వెళ్లేలా చూడొద్దు. ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావొద్దు. విపక్షాల తెరవెనుక ప్లాన్ ఇదే ఉందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. బీఆర్ఎస్ పాలనలో అమ్మితే రైటు.., వివిధ ప్రాజెక్టుల కోసం చెట్లు నరికితే కరెక్టు.. ఇప్పుడు మాత్రం అంతా తప్పు. ఇదేనా రాజకీయం?


కంచ గచ్చిబౌలి భూములపై పేక్ వీడియోలు..

కంచ గచ్చిబౌలిలో జేసీబీలతో రాత్రిళ్లు చదును చేస్తుంటే.. పక్షులు, నెమళ్ల అరుపులు, హాహాకారాలు అంటూ ఓ ఫేక్ ఆడియోను జాయింట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.. ఎక్కడో చనిపోయిన జింక ఫోటోను ఇక్కడిదే అని షేర్ చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ లు పెడుతున్నారు. జేసీబీలు చదును చేస్తుంటే ఈ జింక చనిపోయిందని ప్రచారం చేస్తున్నారు. ఇక లాండ్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దంటూ ఉద్యమంలో మరింత సెంటిమెంట్ పెంచేలా.. ఇదిగో ఇలా ఏఐ జెనరేటెడ్ ఇమేజ్ ను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. జేసీబీలను చూసి నెమళ్లు, జింకలు ప్రాణభయంతో పరుగెడుతున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ స్టోరీలు రన్ చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? ప్రభుత్వానికి చెందిన, సుప్రీం కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు దక్కించుకున్న భూమి చుట్టూ ఎంత తతంగం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.


400 ఎకరాలను డెవలప్ చేసి ఇస్తే ఐటీకి మేలు

రాజకీయం అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో మరోలా ఇంతేనా? గత పదేళ్లలో అమ్మాల్సినవి అమ్మేసి, పర్యావరణాన్ని నాశనం చేసి ఇప్పుడు మాత్రం భూములు అసలే అమ్మనట్లు.. కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టుల కోసం చెట్లు నరకనట్లు.. వన్యప్రాణాలను ఇబ్బందిపెట్టనట్లుగా ఉంది కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ తీరు. ఇప్పుడు కంచ గచ్చిబౌలి 400 ఎకరాల చుట్టూ జరుగుతున్న రాజకీయం చూస్తే కొత్త డౌట్లు రాక మానవు. ఎందుకంటే 400 ఎకరాలను డెవలప్ చేసి ఐటీ, ఇతర పెద్ద కంపెనీలకు ఇవ్వాలన్నది రేవంత్ ప్రభుత్వ ఆలోచన. దీంతో ప్రభుత్వ ఖజనాకు 20 వేల కోట్ల దాకా డబ్బు సమకూరుతుంది. అటు ఐటీ జోన్ ను ఆనుకుని ఈ భూములు ఉండడంతో మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ భూమిని లీజుకు ఇవ్వొద్దు.. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ స్థలం. అక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. చాలా వన్యజీవులకు ఆలవాలంగా ఉంది. ఆ ల్యాండ్‌ను ఎలా డెవలప్ చేస్తారు… ఇదీ బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నలు. సో విపక్షాల క్వశ్చన్లు అన్నిటినీ డీకోడ్ చేద్దాం.

400 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ కాదు. థిక్ ఫారెస్ట్ కాదు

నిజానికి కంచ గచ్చిబౌలి 400 ఎకరాలను HCU నుంచి 2003లో ప్రభుత్వం తీసుకున్నప్పుడు గండిపేట దగ్గర ఆల్టర్నేట్ స్థలం ఇచ్చారు. అది IMG కంపెనీకి క్రీడాస్థలాల అభివృద్ధి కోసం ఇస్తే వారు చేయలేదు. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా న్యాయపోరాటం చేసి ఆ భూముల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. పైగా ఆ 400 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ కానే కాదు. థిక్ ఫారెస్ట్ అంతకన్నా కాదు. చిన్న పాటి పొదలు, చిన్న చెట్లు మాత్రమే ఉన్న ఏరియా. ఇక అక్కడ ఏవేవో పక్షి, వృక్ష, సరీసృప, జంతు జాతులు ఉన్నట్లుగా చేస్తున్న ప్రచారంలోనూ నిజం లేదంటోంది ప్రభుత్వం. ఆ భూమిపై ప్రభుత్వానిదే హక్కు ఉన్నట్లు అన్ని డాక్యుమెంట్లు చూపించింది. పని చేయిస్తోంది. డాక్యుమెంట్లు సరిగా ఉండడంతో బీఆర్ఎస్ కొత్త పల్లవి అందుకుంది.

ఇప్పుడు పర్యావణానికి పెను ముప్పు అంటూ ప్రచారం చేస్తున్నారు. అంతెందుకు భూములుంటే అమ్మేస్తారా అన్నది కేటీఆర్ డైలాగ్. భూముల్ని కాపాడాల్సింది పోయి ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే కుదరదన్నారు. అంతే కాదు.. కంచ గచ్చిబౌలి భూములు ఎవరు కొన్నా తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ భూముల్ని కొన్న వారి దగ్గర్నుంచి వెనక్కు తీసుకుని అతిపెద్ద ఎకో పార్క్‌ ఏర్పాటు చేసి, అద్భుతమైన పార్క్‌గా మార్చి హెచ్‌సీయూకు కానుకగా ఇస్తామని కేటీఆర్ అంటున్నారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా HCU విద్యార్థులపై బీఆర్ఎస్‌కు ప్రేమ ఎందుకు పెరిగింది. విద్యార్థుల నిరసనలను ఎగదోయడం లక్ష్యమా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Also Read: కాంగ్రెస్ లోకి కొత్త ప్రభాకర్ రెడ్డి? కేసీఆర్‌కి బిగ్ షాక్..

ఓపెన్ లాండ్ హెరిటేజ్ ఎక్కడైనా ఉంటుందా అన్న కేసీఆర్

రైట్ కేటీఆర్ ఇలా అంటున్నారు కదా.. ఓపెన్ లాండ్స్ గురించి సీఎం హోదాలో కేసీఆర్ నిండు అసెంబ్లీలో ఏం చెప్పారో చూడండి. ఓపెన్ లాండ్ హెరిటేజ్ ఎక్కడైనా ఉంటుందా అని కౌంటర్ ఇచ్చారు. హెరిటేజ్ పేరు చెప్పి ఏమీ ముట్టొద్దు, పట్టొద్దా అని క్వశ్చన్ కూడా చేశారు. హైదరాబాద్ రాక్స్ అని విచిత్రమైన పేర్లు ఎవడు పుట్టిచ్చాడో అని ప్రశ్నించిన పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం పర్యావరణం అంటూ గగ్గోలు పెడుతున్న పరిస్థితి.

విపక్షంలో మాట మారింది.. అవసరాలు మారాయ్..

కేటీఆర్ ఇప్పుడు మాట్లాడిన మాటలకు.. సీఎం హోదాలో కేసీఆర్ మాట్లాడిన మాటలకు మధ్య ఏం మారింది? జస్ట్ అధికారం నుంచి విపక్షానికి వచ్చారు. అంతే మాట మారింది. అవసరాలు మారాయ్. మిగితాదంతా సేమ్ టూ సేమ్. ఈ రెండు ఫోటోలు చూడండి.. ఇది వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణ. 2015 నాటి ఫోటో ఇది. అక్కడ గ్రీనరీ తొలగించి హాస్పిటల్ కట్టాలనుకున్న తర్వాత 2023లో జరిగింది చూడండి. ఎంత తేడా. గ్రీనరీ అంతా ఎక్కడ పోయింది? అప్పుడు పర్యావరణంపై ప్రేమ ఎక్కడికిపోయిందన్న ప్రశ్నల్ని కాంగ్రెస్ వినిపిస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×