BigTV English
Advertisement

UPI Benefits: యూపీఐకి క్రెడిట్ కార్డ్‌ ఇలా లింక్ చేయండి..లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

UPI Benefits: యూపీఐకి క్రెడిట్ కార్డ్‌ ఇలా లింక్ చేయండి..లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

UPI Benefits: దేశంలో డిజిటల్ చెల్లింపుల విధానం తెగ స్పీడుగా కొనసాగుతోంది. చిన్న దుకాణాల నుంచి భారీ షాపింగ్ మాల్స్ వరకూ ప్రతిదీ కూడా UPI చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. ఇదే సమయంలో క్రెడిట్ కార్డు(Credit Card)లను కూడా యూపీఐకి లింక్ చేసి అనేక మంది ఈజీగా క్యాష్‌లెస్ లావాదేవీలను చేస్తున్నారు. పలువురికి మాత్రం ఈ విధానం గురించి తెలియదు. అయితే వీటి ద్వారా అనేక లాభాలు ఉన్నాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి.


క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి?
క్రెడిట్ కార్డ్ అనేది ఒక రకమైన రుణ పద్ధతి అని చెప్పవచ్చు. దీని ద్వారా మీరు ఇప్పుడే ఖర్చు చేసి, తరువాత ఒక నిర్దిష్ట గడువులో చెల్లించాల్సి ఉంటుంది. దీని చెల్లింపుల సమయంలో rewards, cashback, EMI సౌకర్యాలు వంటి ప్రయోజనాలు కస్టమర్లకు లభిస్తాయి. ఈ క్రెడిట్ కార్డులను గతంలో POS మెషిన్ వద్ద చెల్లింపుల కోసం ఎక్కువగా వినియోగించేవారు. కానీ ఇప్పుడు మీరు దీనిని UPIతో లింక్ చేసి, QR కోడ్ స్కాన్ చేసి కూడా చెల్లింపులు చేసుకోవచ్చు.

UPI అంటే ఏంటి?
UPI.. బ్యాంక్ ఖాతా లింక్ ద్వారా తక్షణ చెల్లింపుల కోసం NPCI (National Payments Corporation of India) అభివృద్ధి చేసిన విధానం. PhonePe, Google Pay, Paytm, BHIM వంటి అనేక యాప్‌లు కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.


క్రెడిట్ కార్డ్‌ను UPIకి ఎందుకు లింక్ చేయాలి
ఇప్పటివరకు UPIతో డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసేవారు. కానీ ఇప్పుడు RBI అనుమతితో రూ.2,000 వరకూ UPI ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులు చేసుకోవచ్చు. ఇది క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

క్రెడిట్ కార్డ్‌ను UPIకి లింక్ చేయడం వల్ల ప్రయోజనాలు (UPI Benefits)

-ప్రతి షాపులో POS మెషిన్ ఉండకపోవచ్చు. కానీ QR కోడ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో UPI ద్వారా స్కాన్ చేసి క్రెడిట్ కార్డుతో చెల్లంపులు ఈజీగా చేసుకోవచ్చు.

-చాలా బ్యాంకులు, యాప్‌లు యూపీఐ క్రెడిట్ కార్డు లావాదేవీలపై ప్రత్యేక రివార్డ్స్‌ అందిస్తున్నాయి.

-బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా, UPIకి లింకైన క్రెడిట్ కార్డ్‌ ద్వారా చెల్లింపు చేసుకోవచ్చు.

-మొబైల్ ఫోన్‌లో యూపీఐ యాప్ ఉంటే చాలు స్కాన్ చేసి ఈజీగా పేమెంట్ చేయవచ్చు.

-డెబిట్ కార్డుల కన్నా క్రెడిట్ కార్డులు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయి. దీనివల్ల ఎక్కువ విలువ పొందవచ్చు.

Read Also: Regional Rural Banks: మే 1 నుంచి 15 బ్యాంకుల విలీనం..

UPIకి క్రెడిట్ కార్డ్‌ను ఎలా లింక్ చేయాలి
-ఈ ప్రక్రియను PhonePe, BHIM, Paytm లాంటి యూపీఐ యాప్‌లలో చేసుకోవచ్చు.

-ముందుగా మీకు కావలసిన యూపీఐ యాప్‌ (PhonePe / BHIM / Paytm) Google Play Store లేదా Apple App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.

-యాప్‌ను ఓపెన్ చేసి, మీ మొబైల్ నంబర్‌ ఆధారంగా రిజిస్టర్ అవ్వండి. యాప్‌కి అవసరమైన అనుమతులు ఇవ్వండి.

-అక్కడ ‘Payment Methods’ లేదా ‘Add Bank Account / Card’ అనే ఆప్షన్ క్లిక్ చేయండి.

-ఇప్పుడు “Add Credit Card” లేదా “Link RuPay Credit Card” అనే ఆప్షన్ ఎంచుకోండి. (ప్రస్తుతం ఇది RuPay Network క్రెడిట్ కార్డులకే అందుబాటులో ఉంది.)

-మీ క్రెడిట్ కార్డ్ నంబర్, గడువు తేదీ (Expiry), CVV వంటి వివరాలు నమోదు చేయండి.

-మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ధృవీకరించండి

-ఇప్పుడు మీరు విజయవంతంగా UPIకి మీ క్రెడిట్ కార్డ్ లింక్ చేశారు.

-ఇప్పటి నుంచి మీరు UPI QR కోడ్ స్కాన్ చేసి, మీ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు.

-ప్రస్తుతం RuPay క్రెడిట్ కార్డులు మాత్రమే UPIతో లింక్ అవుతున్నాయి.

-VISA, MasterCard, Amex వంటి కార్డులకు ఇంకా ఈ సౌకర్యం లభించలేదు.

Related News

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Big Stories

×