LiveIn Partner Deadbody| సహజీవనం చేసే ఇద్దరు ప్రేమికుల మధ్య గొడవలు జరగడం సహజం. కానీ ఆ గొడవలు తీవ్రంగా మారడంలో తన ప్రియురాలిని ఆ యువకుడు హత్య చేశాడు. కానీ తన నేరాన్ని కప్పి పుచ్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి అనుకోకుండా అతని పాపభీతి అతడిని పోలీసులకు పట్టించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీ పరిసరాల్లోని ఫరిదాబాద్ జవహర్ కాలనీకి చెందిన 49 ఏళ్ల జీతేంద్ర అలియాస బాబీ తన ప్రియురాలు సోనియా (40)తో కలిసి ఒక అపార్ట్ మెంట్ లో సహజీనం చేస్తున్నాడు. అయితే వీరిద్దరూ గతంతో వేర్వేరుగా వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నవారు. అయితే జీతేంద్ర మాత్రం తన కూతురిని కలవడానికి వెళ్లేవాడు. అది సోనియాకు నచ్చేది కాదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇటీవల జీతేంద్ర తన కూతురిని కలవడానికి వెళ్లిన విషయం సోనియాకు తెలిసింది. దీంతో ఏప్రిల్ 21న ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. జీతేంద్ర కూతురు గురించి సోనియా అసభ్యంగా మాట్లాడింది. దీంతో ఆగ్రహించిన జీతేంద్ర ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. ఆ తరువాత సోనియా కూడా అతనిపై దాడి చేసింది.
అంతే ఇక పట్టలేని కోపంతో జీతేంద్ర.. సోనియా గొంతు నులిమి చంపేశాడు. కాసేపు తరువాత ఆమె చనిపోయిందని తెలిసి షాకైపోయాడు. ఈ విషయం నలుగురికీ తెలిస్తే తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడ్డాడు. అందుకే అప్పటికప్పుడు సోనియా మృతదేహాన్ని తాను పడుకునే బెడ్ లోపల ఉన్న బెడ్ బాక్స్ లో దాచాడు. రెండు రోజుల పాటు అలాగే శవంతో ఇంట్లోనే ఉన్నాడు. ఆ శవాన్ని అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లాలంటే ఏం చేయాలో అతనికి తోచలేదు. మూడో రోజు పక్కింటి వ్యక్తి జీతేంద్ర ఇంటికి వచ్చి ఏదో దుర్వాసన వస్తోందని చెప్పగా.. ఎలుక చనిపోయిందని చెప్పాడు.
వెంటనే బయటికెళ్లి అగర్బత్తీలు వెలిగించి దుర్వాసనను కవర్ చేశాడు. నాలుగో రోజు ఇంటి యజమాని జీతేంద్ర ను కలిసి రాత్రి ఇంటి నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తోందని చెప్పగా.. ఎలుక చనిపోయిందని.. వెంటనే క్లీన చేయిస్తానని బుకాయించాడు. ఆ తరువాత ఇంటిని లాక్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అక్కడి నుంచి బయలుదేరి జీతేంద్ర తన స్వగ్రామానికి వెళ్లాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాజర్ జిల్లా గోచ్చి గ్రామానికి వెళ్లి అక్కడ రెండు రోజుల తరువాత తన సమస్యను ఎవరితోనైనా పంచుకోవాలని భావించాడు. అందుకే తన అమ్మమ్మతో వెళ్లి తనను కాపాడాలని భయపడుతూ విషయం మొత్తం చెప్పేశాడు. కానీ పోలీసులకు మాత్రం చెప్పకూడదని వేడుకున్నాడు.
Also Read: 5 బాటిళ్ల నీట్ లిక్కర్ తాగిన యువకుడు.. రూ.10 వేలు బెట్.. ఆ తరువాత
జీతేంద్ పరిస్థితి చూసి అతడి అమ్మమ్మ అతడిని ఒక గదిలో పెట్టి తాళం వేసింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జీతేంద్ర ఒక యువతిని హత్య చేశాడని చెప్పేసింది. దీంతో ఏప్రిల్ 26న ఢిల్లీ పోలీసులు గోచి గ్రామానికి చేరుకొని జీతేంద్ర అరెస్ట్ చేశారు.
ఇలాంటి కేసు ఒకటి మధ్య ప్రదేశ్ లో కొన్ని నెలల కింద జరిగింది. ఆ కేసులో కూడా సహజీవనం చేసే ఒక ప్రియుడు తన ప్రేయసి చంపి ముక్కలుగా నరికి ఇంట్లోని ఫ్రిజ్ లో దాచి పెట్టాడు. ఆ కేసు అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.