BigTV English

Quant E : సముద్రపు నీటితో నడిచే కారు.. ఎలానో చూడండి!

Quant E : సముద్రపు నీటితో నడిచే కారు.. ఎలానో చూడండి!
Quant E
Quant E

Quant E :  ప్రస్తుత కాలంలో టెక్నాలజీ రోజురోజు అప్‌డేట్ అవుతోంది. దీని కారణంగా సరికొత్త ఆవిష్కరణలు అందరినీ అశ్యర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా కారు అంటే పెట్రోల్ లేదా డిజిల్‌తో నడుస్తాయి.ఇప్పుడైతే ఎలక్ట్రిక్ కారులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే కారు ఏకంగా సముద్రపు నీటితో నడుస్తుంది. ఇటీవల ఈ కారును జర్మనీకి చెందిన క్వాంట్-ఈ అనే కంపెనీ విడుదల చేసింది. ఇది సముద్రపు నీటితో నడిచే మొట్టమొదటి కారు కావడం విశేషం.


ఈ కారు ఉప్పునీటితో ఇంధనంగా పనిచేసే ఎలక్ట్రోలైట్ ఫ్లో సెల్ పవర్ సిస్టమ్‌‌ను కలిగి ఉంటుంది. ఈ కారు నడిచేది విద్యుత్ శక్తితో అయినా ఆ విద్యుత్‌ను సముద్రం నీటి నుంచి గ్రహిస్తుంది. ఈ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాలలో గణనీయమైన పురోగతి సాధించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Also Read : 16 వేల కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ.. ఏ మోడల్స్ అంటే..


ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఇంధన సంబంధిత కార్లు ప్రజాదరణ పొందాయి. అయితే ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు ఛార్జ్ చేయడం, ట్యాంకులకు ఇంధనం నింపడం పెద్ద సమస్యగా మారుతోంది. బ్యాటరీ రీఛార్జ్ చేయాలంటే గంటల సమయం పడుతుంది. కార్లలో ఇంధనం నింపాలన్న కొన్ని సందర్భాల్లో గంటల తరబడి పెట్రోల్ బంకుల ముందు చాలా సమయం వృధా అవుతుంది.

ఈ నేపథ్యంలో క్వాంట్ కంపెనీ తీసుకొచ్చిన కారుతో ఆ సమస్యలకు చెక్ పడనుంది. క్వాంట్-ఈ స్పోర్ట్‌లిమౌసిన్ సముద్రపు నీటి శక్తిని ఉపయోగించి ప్రత్యేకమైన పవర్‌ట్రెయిన్‌ ద్వారా నడుస్తుంది. ఇది విద్యుత్ విశ్లేషణ అనే సిస్టమ్ ద్వారా సముద్రపు నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా డివైడ్ చేస్తుంది. అనంతరం వాటిని విద్యుత్ రియాట్కర్లుగా ఉపయోగించుకుంటుంది. విద్యుత్ విశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్ కారు ఇంధన కణాలలోకి చేరుతుంది. అందులోని ఆక్సిజన్ మాత్రం వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది.

ఇంధన కణాల లోపల చేరిన హైడ్రోజన్ గాలి నుండి ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్తు కారు మోటార్లతో పాటు అన్ని ఇతర విద్యుత్ వ్యవస్థలకు శక్తిని ఇస్తుంది. క్వాంట్-ఈ స్పోర్ట్‌లిమౌసిన్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్. అయితే ఇది రీఛార్జ్ చేయడానికి ఎలక్ట్రిక్ గ్రిడ్‌లో ప్లగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సముద్రపు నీటిని ఇంధనంగా మార్చుకుంటుంది. ఈ కారును ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే అత్యుత్తమ రీఫ్యూయలింగ్ సామర్థ్యాలను అందిస్తుంది. ఇందులో ఉండే పవర్‌ట్రెయిన్ పూర్తిగా పొల్యూషన్ ఫ్రీ. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు.

Also Read : ఇది కదా ఇండియా అంటే.. ఖండాంతరాలు దాటిన ఆల్ట్రావయొలెట్ బైక్

ఈ కారు క్వాంట్-ఈ స్పోర్ట్‌లిమౌసిన్ నానోఫ్లోసెల్ హోల్డింగ్స్‌ అనే సంస్థ ద్వారా లాంచ్ అయింది. లీచ్‌టెన్‌స్టెయిన్‌లో ఉన్న ఒక సంస్థ కారుకు సంబంధించిన ఫ్లో సెల్ బ్యాటరీ, డ్రైవ్ టెక్నాలజీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. నానోఫ్లోసెల్ ఉప్పునీటితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారుచేసే లక్ష్యంతో 2014లో క్వాంట్ ఇ-స్పోర్ట్‌లిమౌసిన్‌ని డెవలప్ చేయడం ప్రారంభించింది. 2014లో మొదటి డ్రైవ్ చేసే ప్రోటోటైప్‌ను ఆవిష్కరించడానికి ముందు కంపెనీ ఫ్లో సెల్ టెక్నాలజీ అభివృద్ధిపై సంవత్సం పాటు పరిశోధనలు జరిపింది. సుదీర్ఘమైన పరీక్షలు, శుద్ధీకరణ తర్వాత 2018లో నానోఫ్లోసెల్ క్వాంట్ ఇ స్పోర్ట్‌లిమౌసిన్‌ నమూనాను విడుదల చేసింది. ఈ కారు ఉప్పు నీటిని ఇంధనంగా మార్చుకునే మొదటి వాహనం.

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×