Big Stories

Lok Sabha Elections 2024: మహారాష్ట్రలో కిచిడీ రాజకీయం.. ఎంవీఏ కూటమిలో భగ్గుమన్న విభేదాలు

Lok Sabha Elections 2024Lok Sabha Elections 2024: మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారి.. అంతా కిచిడీ చుట్టూర తిరుగుతోంది. కిచిడీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లోక్ సభ సీటు కేటాయించడంపై కాంగ్రెస్ మండిపడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహావికాస్ అఘాడీలో మరోసారి వెలుగుచూశాయి. ఇటీవలే రాష్ట్రంలో చికిడీ కుంభకోణం దేశవ్యాప్తంగా మారిన విషయం తెలిసిందే.

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల వేల మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) తీరుపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కిచిడీ ఛోర్ కు ఎంపీ టికెట్ కేటాయించారంటూ విమర్శలు చేసింది. దీంతో శివసేన(యూబీటీ)పై కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు.

- Advertisement -

మహారాష్ర్టలో శివసేన(యూబీటీ), కాంగ్రెస్, శరద్ పవార్ అధ్వర్యంలోని ఎన్సీపీలు కలిసి మహావికాస్ కూటమిని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. కూటమిలో భాగంగా శివసేనకు 19 సీట్లు, కాంగ్రెస్ కు 16 సీట్లు, ఎన్సీపీకి 9 కేట్లు కేటాయించాయి. మిగిలిన 4 సీట్లపై ప్రస్తుతం చర్చలు జరగుతున్నాయి.

అయితే శివసేన(యూబీటీ) కూటమిలో భాగంగా ఎంపీ గంజనన్ కీర్తికర్ కుమారుడు అమోల్ కు ఎంపీ సీటును కేటాయించింది. అయితే శివసేన జాబితా విడుదల చేసిన రోజే అమోల్ కు కిచిడీ కుంభకోణంలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో అటువంటి వ్యక్తికి సీటు కేటాయించడంపై శివసేనపై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ మండిపడ్డారు. శివసేన(యూబీటీ) కిచిడీ ఛోర్ కి టికెట్ కేటాయించిందని, అలాంటి వారికోసం తాము పనిచేయలేం అని ఆయన స్పష్టం చేశారు.

తాజాగా శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ కూటమిలో భాగంగా తమకు కేటాయించిన 19 సీట్లు కాకుండా తాము 22 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో వంచిత్ బహుజన్ అఘాటీ కూటమి నుంచి బయటకు వచ్చింది. శివసేన తీసుకుంటున్న నిర్ణయాలతో కూటమికి తీవ్ర స్థాయిలో నష్టం ఏర్పడే అవకాశం కాంగ్రెస్ మండిపడుతోంది.

అసలేంటీ కిచిడీ స్కామ్..
కరోనా మహమ్మారి సమయంలో నగరంలో చిక్కుకుపోయిన కార్మికులకు కిచిడీ పొట్లాలు అందించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పొట్లాటు అందించే కాంట్రాక్ట్ విషయంలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ ఈ కేసును విచారించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ కుంభకోణంకు సంబంధించి ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇటువంటి తరుణంలో ఈ కిచిడీ స్కామ్ లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమోల్ కు ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) ఎంపీ సీటు కేటాయిండంపై కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News