BigTV English

Hyundai Inster EV: ఈవీల క్రేజ్.. హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. లాంచ్ ఎప్పుడంటే?

Hyundai Inster EV: ఈవీల క్రేజ్.. హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. లాంచ్ ఎప్పుడంటే?

Hyundai Inster EV: ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. ఇందులో భాగంగా ఆటో కంపెనీ హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. టాటా పంచ్ ఈవీకి పోటీగా దీన్ని తీసుకువస్తున్నారు. ఇందులో సేఫ్టీ ఫీచర్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రాబోయే EV లోపలి భాగం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కారు 2026 సంవత్సరంలో భారత మార్కెట్లోకి విడుదల కావచ్చు. ఇది ఇటీవల ప్రపంచవ్యాప్తంగా దీన్ని పరిచయం చేశారు.


హ్యుందాయ్ ఇన్‌స్టర్‌ను లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. లాంచ్‌కు ముందు, కంపెనీ దీనికి సంబంధించి కొంత సమాచారాన్ని కూడా ఇచ్చింది. ఇది పరిమిత పార్కింగ్ ప్రదేశాలలో పనిచేసేలా డిజైన్ చేశారు. ఈ కాంపాక్ట్ SUV రెండు బ్యాటరీ వేరియంట్‌లతో వస్తుందని హ్యుందాయ్ వెల్లడించింది. ఇందులో 42 kWh బ్యాటరీతో కూడిన స్టాండర్డ్ మోడల్, 49 kWh బ్యాటరీతో లాంగ్ రేంజ్ వెర్షన్ ఉన్నాయి.

Also Read: హ్యుందాయ్ నుంచి కొత్త SUV.. త్వరలో అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్!


స్టాండర్డ్ మోడల్ 95 bhp అందిస్తుంది. అయితే లాంగ్ రేంజ్ మోడల్ 113 bhp అందిస్తుంది. రెండూ 147 Nm టార్క్‌ను అందిస్తాయి. 120 kW DC ఛార్జర్‌ని ఉపయోగించి ఇన్‌స్టర్ దాని ఛార్జ్‌ను దాదాపు 30 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు పెంచుకోవచ్చు. ఇది స్టాండర్డ్‌గా 11 kW ఆన్-బోర్డ్ ఛార్జర్‌తో వస్తుంది.

ఈ కారులోని సేఫ్టీ ఫీచర్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇందులో రెండు 10.25 అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. మరొకటి ఇది నావిగేషన్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. ఇది కాకుండా ఇన్‌స్టర్ 64-రంగు LED లైటింగ్, వన్-టచ్ సన్‌రూఫ్ ,హ్యుందాయ్ డిజిటల్ 2 టచ్ (NFC) ఫీచర్ కలిగి ఉంది.

భద్రత పరంగా ఈ కాంపాక్ట్ SUV అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)తో వస్తుందని హ్యుందాయ్ స్పష్టం చేసింది. ఇది సరౌండ్ వ్యూ మానిటర్ (SVM), పార్కింగ్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్ రియర్ (PCA-R), బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ (BVM), ఫార్వర్డ్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్ 1.5 వంటి ఫీచర్లు ఉంటాయి.

Also Read: కొత్త బైకుల సందడి.. అదరగొడుతున్న లుక్.. లాంచ్ డేట్లు ఇవే!

ఇది బ్లైండ్-స్పాట్ కొలిషన్-ఎవాయిడెన్స్ అసిస్ట్ (BCA), రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిషన్-ఎవాయిడెన్స్ అసిస్ట్ (RCCA)తో పాటు లేన్ కీపింగ్ అసిస్ట్ (LKA), లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ (LFA) వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. హ్యుందాయ్ ఇటీవల తన చిన్న ఎలక్ట్రిక్ కార్ ఇన్‌స్టర్ EVని గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు భారతదేశంలో కూడా లాంచ్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించినట్లు అనేక నివేదికలు వెల్లడవుతున్నాయి. ఇది 2026 చివరి నాటికి భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఇది టాటా పంచ్ EVతో పోటీపడుతుంది.

Tags

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×